నిర్మల్ జిల్లాలో ఘాట్ రోడ్ వద్ద ప్రమాదవశాత్తూ లోయలో పడి పోయిన కార్ నుండి ముగ్గురిని రక్షించిన నిర్మల్ పోలీసులు.

0

 నిర్మల్ జిల్లాలో ఘాట్ రోడ్ వద్ద ప్రమాదవశాత్తూ లోయలో పడి పోయిన కార్ నుండి ముగ్గురిని రక్షించిన నిర్మల్ పోలీసులు.

ఈ రోజు ఉదయం 2 గంటలకు హైదరాబాద్ నుండి నాగపూర్ కి వెళ్తున్న కారు మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్ లో పొగ మంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక, అదుపు తప్పి లోయలో పడిపోయింది.

Dail 100 ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్ కి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తం అయిన నిర్మల్ DCRB ఇన్స్పెక్టర్ గోపినాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్ ఇద్దరు వెళ్లి వారిని లోయలో గుర్తించి 

కారు లో ఉన్నటువంటి రాధా కృష్ణ మరియు ఆయన భార్య, కుమారుడిని ముగ్గురిని కాపాడారు. ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్ కి చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు.

ఇన్స్పెక్టర్ గోపీనాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్, మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల అభినందించారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version