నాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ 46వ డివిజన్ విస్తృత స్థాయి సమావేసం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వైసిపి ఇన్చార్జ్ వెల్లంపల్లి మేయర్ రాయన భాగ్యలక్ష్మి

0
0

విజయవాడ
27-07-2025

స్థానిక 46వ డివిజన్ ప్రసాద్ థియేటర్ వీధిలోగల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నివాసం నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాయన నరేంద్రల ఆధ్వర్యంలో ఆదివారం నాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ 46వ డివిజన్ విస్తృత స్థాయి సమావేసం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంఛార్జ్ అయుతా కిశోర్ ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ముందుగా డా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులార్పించారు అనంతరం బాబు మోసాలను, ప్రజలకు ఇచ్చిన బాండ్లు, వైయస్ జగన్ ప్రెస్ మీట్ ని టివిలో చూపించారు. ఇంటింటికి క్యూ ఆర్ కోడ్ తో వెళ్లి ప్రజలతో ఆ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేపించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూ ఆర్ కోడ్ ని ఆవిష్కరించారు

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయడం కోసం చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతొ సమావేశం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు మాటలు ప్రజలెవ్వరూ నమ్మరని అది తెలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తమ ప్రతినిధులను ఇంటింటికి పంపించి మోసం చేసేవిధంగా మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ముగ్గురికి అమ్మఒడి వస్తుందని ముగ్గురు పిల్లలకి కలిపి మూడు పదిహేను వేలు 45 వేలు వస్తుందని , 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి నెలకు 15 వందలు ఇస్తామని ఇంటికి ఇద్దరు ఉంటె ఇద్దరికీ నెలకి 15 వందలు చొప్పున సంవత్సరానికి 36 వేలు వస్తుందని, చదువు పూర్తయి ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకి 3 వేళ చొప్పున సంవత్సరానికి 36 వేలు ఇస్తామని ఇతరాలు పధకాలు వాటి ద్వారా వచ్చే లబ్దిని రాసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్రికరణ సుద్దితో జూన్ 24 నుంచి అమలు చేస్తామని సంవత్సరానికి 2 లక్షల రూపాయల లబ్ది చేకూరుతుందని 5 సంవత్సరాలకి కలిపి 10 లక్షలు లబ్ది చేకూరుతుందని పత్రాలను, బాండ్లను పంచి ప్రజలను మోసం చేశారన్నారు. అమ్మఒడి లోకేష్ మెదడు లోనుంచి వచ్చిందంటున్నారు, చంద్రబాబు కళ్ళార్పకుండా అబ్బద్దలు చెపుతాడన్నారు. అచ్చమ్ నాయుడు అడ బిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నాడని ఎన్నికల ముందు నీకు నీకు పదిహేను వేలు అన్నపుడు మీకు తెలీదా మీకు సిగ్గుందా అని ప్రశ్నించారు. రైతు భరోసా అమలు చేయలేదన్నారు. మాకు ఈ పధకం రాలేదా అని అడిగితె మీ నాలుక మందం అని అంటున్నారన్నారు. కూటమి సంవత్సర పాలనలో అమ్మఒడి లేదని, రైతు భరోసా లేదని, ఫీజ్ రీయంబర్స్మెంట్ లేదని, ఆరోగ్యశ్రీ లేదని, ఒక్క పెన్షన్ ఇచ్చారని దానిలో కూడా 5 లక్షల మందిని జాబితా లోనుంచి తొలగించారన్నారు. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలు ప్రజలకు అందిస్తుంటే చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక అవుతుందన్నారని. జగన్ 5 ఏళ్ల హయాంలో 3 లక్షల కోట్లు అప్పు చేసాడని మొత్తం పథకాలన్ని అమలు చేసాడని కానీ కూటమి వచ్చిన సంవత్సరంలోనే 1 లక్ష 75 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసారని ఏ పధకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా సంక్షేమ పధకాలు అందించి రాష్ట్రానికి ఏ లోటు రాకుండా నడిపించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ని కొనియాడారు. సుపరిపాలన పేరుతో దసరా వేషాలు వేసుకుంటూ కూటమి నేతలు తిరుగుతున్నడన్నారు. సుపారీ పాలన పేరుతొ కూటమి నేతలు ప్రజల వద్దకు వచ్చినపుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు కూటమి నేతలను ప్రశ్నించే విధంగా చైతన్యం తీసుకురావాలన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను, జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచిని ప్రజలలోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు పత్రలలో పధకాలు వచ్చాయ లేదా అన్ని ప్రజలను అడిగి గుర్తుచేయాలన్నారు. ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను, బాండ్లను చూపించి ప్రశ్నించే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సంపద సృష్టి పేరుతొ కరెంట్ చార్జీలు పెంచానని అధికారంలోకి వచ్చిన తరువాత విపరీతంగా పెంచేసాడన్నారు. సుపరిపాలనలో బిజెపి, జనసేన నేతలు తిరగడం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాలలో పదవులు పొందిన వారు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here