విజయవాడ నగరపాలక సంస్థ
24-07-2025
నగర పరిధిలో గల మరుగుదొడ్లను భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా చెయ్యండి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు
నగర పరిధిలో గల మరుగుదొడ్లను భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా చెయ్యాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. గురువారం ఉదయం తన పర్యాటన లో భాగంగా ఇంద్ర గాంధీ మున్సిపల్ స్టేడియం వాటర్ ట్యాంక్ రోడ్, సాంబమూర్తి రోడ్, గవర్నర్‌పేట సి కె రెడ్డి రోడ్, అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మరుగుదొడ్లన్నీ భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే నగరంలో ఉన్న 70 మరుగుదొడ్లను వాటికి చేయాల్సిన మరమ్మతులు ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రణాళికను సిద్ధం చేయగా వాటిని త్వరగా అమలుపరిచి నగర పరిధిలోగల మరుగుదొడ్లను ఉత్తమ మరుగుదొడ్లుగా ఉంచాలని అన్నారు. నగరంలో ఇంజనీరింగ్ అధికారులందరూ ప్రతి రోడ్డులో పర్యటించి నగరంలో ఉన్న 1640 గుంతలను పుడ్చినప్పటికీ కొత్త గుంతలు ఏమైనా ఏర్పడినాయా లేవా అని ఎప్పటికప్పుడు పరిశీలించి కొత్తగా ఏర్పడిన గుంతలను కూడా పూడ్చి గుంతలు లేని నగరంగా విజయవాడ ను ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో కమిషనర్ సాంబమూర్తి రోడ్ లో ప్రమాదంగా ఉన్న గ్రేటింగ్ను గమనించి త్వరగా మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్రీటింగ్ను ఉంచాలని అన్నారు. రోడ్లను పరిశుభ్రంగా ఉడవాలని, డివైడర్ దగ్గరి నుండి ఫుట్‌పాత్ వరకు పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రోడ్డుపైనున్న పాత సామాన్లు, కార్లను ఉంచకుండా రోడ్డు సుందరీకరణలో భాగంగా వాటిని తీసివేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. బ్రిడ్జిల పైన ఉన్న మెష్లపై పిచ్చి మొక్కలు మొలవకుండా ప్రజారోగ్యం, ఉద్యానవన శాఖలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని ఆదేశించారు.
నగరంలో ఉన్న మార్కెట్లు, రైతు బజార్లలో నుండి వచ్చే వ్యర్ధాలపై సంపూర్ణ నివేదికను సమర్పించాలని చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఎస్టేట్ ఆఫీసర్లు సమన్వయంతో వ్యర్ధాల నిర్వహణపై ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
వర్షాకాలం దృశ్య దోమలు పెరగకుండా ఉండేందుకు వార్డ్ వారీగా వార్డులో ఉన్న జనాభా ప్రాతిపదికన వార్డ్ సైజు ప్రకారం మలేరియా సిబ్బంది మరియు యాంటీ మలేరియల్ ఆక్టివిటీస్ నిర్వహించాలని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. వ్యర్ధాల సేకరణలో డోర్ టు డోర్ కలెక్షన్ ఎలా జరుగుతుందో, అలాగే యాంటీ లార్వే ఆక్టివిటీస్ జరగాలని అన్నారు.
తదుపరి అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషను పరిశీలించి చెత్త తరలింపునకు మరికొన్ని వాహనాలు పెట్టి గార్బేస్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో పేరుకుపోయిన వ్యర్థాలను జిందాల్ కు పంపించే ఏర్పాట్లు అధికారులు త్వరగా చేయాలని ఆదేశించారు. తదుపరి సింగ్ నగర్ లో గల అన్న క్యాంటీన్ ను పరిశీలించి అన్న క్యాంటీన్ లో పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి, వాడుక నీటి సరఫరా జరుగుతుండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నోడల్ ఆఫీసర్లు అన్న క్యాంటీన్ ప్రతిరోజు పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు.