నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు

0
0

విజయవాడ నగరపాలక సంస్థ
31-07-2025

నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు

నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక, సామిల్ రోడ్డు, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, వెంకటరెడ్డి స్కూల్ రోడ్డు, కృష్ణలంక సర్వీస్ రోడ్డు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కృష్ణలంకలో పారిశుధ్య నిర్వహణ చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారికి పనిముట్లు సరైనవి, ఉన్నాయా లేవా, తోపుడు బళ్ళు సరిపడ ఉన్నాయా లేవా, వ్యర్థ సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రతిరోజు రోడ్లు పరిశుభ్రపరుస్తున్నారా లేదా, డ్రైన్లలో వ్యర్ధాలు తొలగిస్తున్నారా లేదా వంటి విషయాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వ్యర్ధాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, నగర పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలని, స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉన్నత స్థాయిని నిలబెట్టుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here