నందిగామలో మొండితోక వసూల్ బ్రదర్స్ ఎదురీత డీలాపడుతున్న వైసీపీ క్యాడర్ దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య

0

 నందిగామలో మొండితోక వసూల్ బ్రదర్స్ ఎదురీత

డీలాపడుతున్న వైసీపీ క్యాడర్

దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య

నందిగామలో రాజకీయం రసవత్తరం

నందిగామ  చందర్లపాడు 

నందిగామ నియోజకవర్గంలో మొండితోక వసూల్ బ్రదర్స్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన, కొండలు, గుట్టలు, ఇసుక, భూములు, మట్టి దోచేసిన బ్రదర్స్ కు నియోజకవర్గంలో ఎదురీత తప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది. ఉద్యోగులంతా వన్‌సైడ్‌గా కూటమికి అనుకూలంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటేసినట్టు ప్రచారం సాగడమే దానికి ఉదాహరణ.

ఈ నేపథ్యంలో నందిగామలో వైసీపీ అభ్యర్థికి ఉక్కబోతతో పాటు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక ఎన్నికలకు మూడే రోజుల సమయం ఉంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రంతో ప్రచారం నిలిపివేయాలి. దీంతో వైసీపీ అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. టీడీ పీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో ప్రజల భుజం తట్టగా.. వైసీపీ మేనిఫెస్టో చతికిలపడిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సీఎం జగన్‌ విధానాలకు అన్ని వర్గాల ప్రజలు విసిగివేసారిపోయారు. ఈ నేపథ్యంలో నందిగామలో బ్రదర్స్ కు ఎదురీదక తప్పడం లేదు.

గురువారం నాడు చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే చంద్ర బాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version