ధ‌ర్మం ప‌క్ష‌మే యాద‌వులు నిల‌బ‌డ‌తారు..నిబ‌ద్ధ‌త‌కు మారు పేరుశ్రీకృష్ణ యాద‌వ సంఘం వ‌న‌స‌మారాధ‌న‌లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి

Spread the love

ధ‌ర్మం ప‌క్ష‌మే యాద‌వులు నిల‌బ‌డ‌తారు..నిబ‌ద్ధ‌త‌కు మారు పేరు
శ్రీకృష్ణ యాద‌వ సంఘం వ‌న‌స‌మారాధ‌న‌లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి

జి.కొండూరు : ధ‌ర్మం పక్ష‌మే యాద‌వులు నిల‌బ‌డ‌తార‌ని, నిబ‌ద్ధ‌త‌కు మారు పేరు అని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు. మైల‌వ‌రం నియోజ‌క‌వర్గం జి.కొండూరు మండ‌లం కుంటముక్క‌ల అడ్డ‌రోడ్డు మామిడితోట‌లో మైల‌వ‌ర్గ నియోజ‌క‌వ‌ర్గ శ్రీకృష్ణ యాద‌వ సంఘం ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాస వ‌న‌స‌మారాధ‌న కార్య‌క్ర‌మానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.

ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు కొండ‌పల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ చెన్నుబోయిన చిట్టి బాబు, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ బిసి సెల్ అధ్యక్షుడు ప‌టాపంచ‌ల న‌ర‌సింహారావు, నియోజ‌క‌వర్గ తెలుగు యువ‌త అధ్య‌క్షుడు లంకా ల‌తీష్ ల‌తో పాటు శ్రీకృష్ణ యాద‌వ సంఘం నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వ‌న‌స‌మారాధ‌న సంద‌ర్భంగా నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో గెలిచిన విజేత‌ల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ యాద‌వ సామాజిక వ‌ర్గానికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా అండ‌గా నిల‌బ‌డి ఆ స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ తో క‌లిసి ప‌రిష్క‌రిస్తానన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకృష్ణ యాద‌వ సంఘం సెక్ర‌ట‌రీ న‌క్కుళ్ల నాంచార‌య్య‌, స‌ల‌హాదారుడు జి.వి.రావు, కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి తోక‌ల సాంబ‌శివ‌రావుల‌తో పాటు యాద‌వ సంఘం నాయ‌కులు, స‌భ్యులు, యువ‌కులు, మ‌హిళ‌లు పాల్గొన్నారు.

Loading