అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ డివిజన్, ఎన్.టి.ఆర్ పోలీస్ కమీషనరేట్
తేది.03.07.2025
దొంగతనం కేసులలో నిందితుడి అరెస్ట్ చేసిన గుణదల పోలీసులు
నిండితుడి వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువైన (60 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి) చోరీ సొత్తు స్వాదీనం.
ఎన్.టి.ఆర్ జిల్లా, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, ఇన్ ఛార్జ్ డీసీపీ కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో సెంట్రల్ డివిజన్ ఏ.సి.పి డి. దామోదర రావు ఆద్వర్యంలో, గుణదల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాసరావు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగతనాలు చేసే అనుమానితుల కదలికల పై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ క్రమంలో సదరు ప్రత్యేక బృందానికి రాబడిన సమాచారం మేరకు ది. 02.07.2025 వ తేదిన సాయంత్రం ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో పోలీసు వారిని తనిఖీలను గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 06 లక్షల రూపాయల బంగారు, వెండి వస్తువులను (చోరీ సొట్టును) స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
నిండితుడి వివరాలు:
- విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాకు చెందిన ఉయ్యాల రాజేష్ (24 సం.)
విచారణలో నిందితుడు ఉయ్యాల రాజేష్ ఏడో తరగతి వరకు చదువుకొని కొంతకాలం కులి పనులు చేసుకునేవాడు ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక పోవడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు, ఈ క్రమంలో ఇతనిపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇతన్ని చివరి సారిగా 2024 సెప్టెంబర్ నెలలో గుణదల పోలీస్ వారు దొంగతనం కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అనంతరం జనవరి నెలలో బెయిల్ పై విడుదలై తన ప్రవుత్తిని మార్చుకోకుండా దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో గుణదల మురళి నగర్ కట్ట మీద మరొక దొంగతనం చేసినాడు ఈ కేసు ధర్యాప్తు లో భాగంగా అనుమానితుడైన ఉయ్యాల రాజేష్ పై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతనిపై ఇప్పటికే 12 దొంగతనం కేసులు కలవు.
ఈ నాలుగు నెలల కాలంలో పటమట, రాజోలు ,నూజివీడు, నర్సాపురం, మరియు నాయుడు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసినాడు.
నిండితుడి వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువైన (60 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు) చోరీ సొత్తు స్వాదీనం చేసుకోవడం జరిగింది.
సాంకేతిక ఆధారాలు ఉపయోగించుకొని గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులను చేదించడంలో కీలకంగా వ్యవహరించిన గుణదల ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది లను అధికారులు అభినందించారు.