దేశీయ నావిగేషన్ వ్యవస్థకూ కీలకంగా మారిన ఇస్రో అటామిక్ క్లాక్

0


 భారత్‌లో సాంకేతిక స్వావలంబన దిశగా మరో కీలక అడుగు పడింది. త్వరలో దేశంలోని అన్ని గడియారాలు(స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా) ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైం ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాయి. 


అయితే, ఇస్రో గతేడాది రూబీడియం క్లాక్‌ను రూపొందించింది. స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్‌లో దిన్ని తొలిసారిగా ఉపయోగించారు. నావిక్‌లోని తొలి తొమ్మది ఉపగ్రహాలను 2013 నుంచి 2023 మధ్య లాంచ్ చేయగా వాటిల్లో..విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రుబీడియం అటామిక్ క్లాక్స్‌నే ఉపయోగించారు. అయితే, గతేడాది మేలో ప్రయోగించిన పదో ఉపగ్రహంలో మాత్రం ఇస్రో రూపొందించిన అటామిక్ క్లాక్‌ను వినియోగించారు. ఈ క్రమంలో దేశంలోని అన్ని గడియారాలను ఈ క్లాక్ టైంతో త్వరలో సింక్ కానున్నాయి. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version