పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ విమర్శలు గుప్పించారు. ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే సీఏఏ నిబంధనలను హడావుడిగా రూపొందించి విడుదల చేశారని దుయ్యబట్టారు. సీఏఏ చట్టం ఎంత వరకు రాజ్యాంగబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిబంధనలను విడుదల చేశారని చెప్పారు.
ముస్లింలు రంజాన్ మాసం తొలి రోజును జరుపుకుంటున్న రోజే సీఏఏకు చెందిన చెడు వార్తను వారు వినాల్సి వచ్చిందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో అణచివేతకు గురైన మైనార్టీ ప్రజల కోసమే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెపుతోందని… అలాంటప్పుడు ఈ జాబితాలో శ్రీలంకలోని తమిళులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. మన దేశాన్ని మతం, కులం, ప్రాంతం ఆధారంగా చీల్చాలనుకునే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Spread the loveవిజయవాడ, తేదీ: 18.11.2025• రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు• నేటి వరకు 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు• గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అదనం• 560 కోట్ల 48 […]
Spread the love ఇంద్రకీలాద్రి కె.ఎస్ రామరావుసందర్శించారు.ఈ సందర్భంగా వేద పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వేద విద్య, వసతులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ : […]
Spread the love టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తండ్రయ్యాడు. శర్వా తన 40వ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అతని భార్య రక్షితా రెడ్డి […]