దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్‌

5
0

 దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్‌

ఇంద్ర‌కీలాద్రి, ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ డి.కె.బాలాజీ మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ కమిషనర్ రత్నరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌గా వేద పండితులు ఆశీర్వచనం ప‌లికారు. అనంత‌రం క‌లెక్ట‌ర్‌కి అమ్మ‌వారి శేష‌వ‌స్త్రం, ప్ర‌సాదాలు, అమ్మ‌వారి చిత్ర‌ప‌టం అంద‌జేశారు. 

నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి రూ.1,00,116 విరాళం

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్ర‌కీలాద్రిపై అమ‌ల‌వుతున్న నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి  చంద్ర‌మౌళి నగర్, గుంటూరుకు చెందిన వ్యామజాల శివరామయ్య అన్నదానం నిమిత్తం  రూ.1,00,116/-లును  మంగ‌ళ‌వారం ఆలయ అధికారులను కలిసి విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా అధికారులు దాత కుటుంబానికి అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వేదార్వచనం ఇప్పించారు. అనంత‌రం అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. న్యూస్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here