దివ్యాంగులను గుర్తించేది – ఆదుకునేది చంద్రబాబు ప్రభుత్వమే

1
0

30-7-2025

దివ్యాంగులను గుర్తించేది – ఆదుకునేది చంద్రబాబు ప్రభుత్వమే

బ్యాటరీ ట్రై సైకిల్ అందిస్తున్న -MLA బొండా ఉమ

ధి:30-7-2025 బుధవారం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాళ్లు దెబ్బతిని అంగ వికలాంగుడిగా ఉండి నడవలేని పరిస్థితులలో ఉన్న 27వ డివిజన్ బావాజీ పేటకు చెందిన శ్రీనివాస్ రావుకు బ్యాటరీ ట్రై సైకిల్ ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో అందజేయడం జరిగింది

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం అందర్నీ ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని దానిలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని  గత పది రోజుల నుండి 27 ట్రైసైకిళ్లను, కాళ్లు దెబ్బతిని అంగ వికలాంగులుగా ఉన్న ఉచితంగా బ్యాటరీతో నడిచే మూడు చక్రాల మోటారు బండిని సొంత నిధులతో ఉచితంగా అందించడం జరుగుతుందని..

దానిలో భాగంగా ఈరోజు 27 వ డివిజన్ బావాజీ పేటకు చెందిన శ్రీనివాసరావుకు ఈ ట్రై సైకిల్ ను అందించడం, ఆరోగ్యపరంగా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చేయడమే కాకుండా అన్ని రకాల వ్యాధులకు ఈ ప్రాథమిక వైద్యశాలలో ఉచితంగా రక్త పరీక్షలు చేసి, ఉచితంగా మందులు కూడా అందించేటువంటి చర్యలు కొనసాగుతున్నాయని

అదేవిధంగా ప్రభుత్వ దవాఖానాలో అధునాతనమైనటువంటి వైద్యాన్ని కూడా అందిస్తూ పేదలను ఆదుకుంటున్నామని అన్నారు, ఈ నియోజకవర్గ పరిధిలోని రోడ్లమీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఇప్పటికే పెద్ద ఎత్తున తోపుడు బండ్లను అందించి వారి వ్యాపార అభివృద్ధికి, ఆర్థిక స్థితిగతులకు సహకరిస్తున్నామని, అలాగే వినికిటి సమస్యతో బాధపడుతున్న వారికి వెంటనే వినికిడి యంత్రాలను వారికి అందజేయడం జరిగిందని

ప్రధానంగా NDA ప్రభుత్వం విద్యా వైద్యం ఉపాధి మీద దృష్టిని కేంద్రీకరించి ఆయా సమస్యలతో ఉన్నటువంటి వారందరికీ ఆ సమస్యను పరిష్కారం చేసి తద్వారా వారందరినీ ఆదుకుంటున్నామని భవిష్యత్తులో నియోజకవర్గంలో పేదవారికి అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, దాసరి కనకారావు, బత్తుల కొండ,లబ్బా వైకుంఠం, దాసరి జయరాజు, మల్లంపల్లి సురేష్, బాసెట్టి ప్రసాద్, గోపిరెడ్డి, మోదుగుల గణేష్, పైడి శ్రీను, అలా తారక రామారావు, మాల్యాద్రి, గౌసియా, సుల్తానా, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here