దీపావళి శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి

Spread the love

దీపావళి శుభాకాంక్షలు
ప్రతి లోగిళ్ళలో వెలుగులు నింపి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని. శుభాలను ఆహ్వానించే వెలుగుల పండగ దీపావళి. ఈ పర్వ దినాన ప్రతి భారతీయుడికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. దీప కాంతిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే ఘన సంస్కృతి మనది. నరకాసురుడు అనే రాక్షసున్ని వధించాక మానవాళికి సుఖసంతోషాలు లభించాయి. ఆ సంతోషంతో దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటున్నాము. ప్రజలందరికీ దీపావళి పర్వదినాన సంపూర్ణ ఆయురారోగ్యాలు, శుభాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కాంతి రేఖలను ప్రసరింపజేస్తోంది. సంక్షేమ దీపాలను వెలిగిస్తోంది. స్థానిక ఎన్నికలలో పట్టణ, పల్లె ప్రజలు – ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికీ, అందిస్తున్న సంక్షేమ పథకాలకీ మద్దతు తెలిపి కూటమి పక్షాలకు విజయాన్ని అందించి ముందుగానే దీపావళి వేడుకను తీసుకువచ్చారు.
(పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి

Loading