తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వర రావు 70వేల ఓట్లు పైబడి సెంట్రల్ నియోజకవర్గం నుండి ప్రజల ఓట్లతో

5
0

5-6-2024

సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం

ది;5-6-2024 బుధవారం ఉదయం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా NDA కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వర రావు 70వేల ఓట్లు పైబడి సెంట్రల్ నియోజకవర్గం నుండి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి శుభ సందర్భంలో రాష్ట్రంలోని, నగరంలోని నియోజకవర్గం లోని వివిధ డివిజన్ ల నుండి రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, విజయవాడ సిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు ఇచ్చి మిఠాయిలు పంచి బండ ఉమామహేశ్వరావు ని అభినందిస్తూ నృత్య విన్యాసాలతో సంబరాలు జరుపుకోవడం జరిగినది, ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు ప్రతిబింబించడం కాకుండా దానిలో కృష్ణాజిల్లా స్థాయిలోనే అత్యధిక మెజారిటీతో వచ్చినటువంటి బోండా ఉమామ ని ప్రత్యేకంగా అభినందించడం జరిగినది అందరూ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో మరింత బొండా ఉమా ఉన్నత స్థాయి పదవులకు చేరుకోవాలని ముక్తకంఠంతో ఆకాంక్షించారు…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ;- ఇది ప్రజానీకం విజయమని ప్రత్యేకించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని వెల్లడి చేయడంతో పాటు తనతో పాటు కలిసి వచ్చి తనను ఈ స్థాయికి తీసుకొని వచ్చి ఎంతటి మెజార్టీని కట్టబెట్టినటువంటి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో ప్రజలకు అనుగుణంగా ప్రజా రంజికమైనటువంటి పాలనను ఎన్డీఏ ప్రభుత్వం అందించుతుంది అని 42 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపకు ప్రతిరూపమైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందటమే కాకుండా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అందిస్తామని …

ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మరింత గుర్తింపును తీసుకొని వస్తూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యలను తక్షణమే తీరుస్తూ అందరి ఆమోదమే నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజులలో ప్రజలకు అండగా ఉంటానని, ఇంతటి మెజారిటీను అందించినటువంటి వాటర్ మహాసేవులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో;- తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు బొండా ఉమా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here