థాంక్యూ సీఎం సార్
తల్లికి వందనం అమలుపై మంత్రి సవిత ధన్యవాదాలు
మంత్రి లోకేశ్ కూ ధన్యవాదాలు తెలిపిన మంత్రి
అమరావతి : సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం పథకం అమలుచేయడంపై సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కృతజ్ఞతలు తెలియజేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును, మంత్రి నారా లోకేశ్ ను మంత్రి సవిత గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి ఎస్.సవిత శుభాకాంక్షలు తెలియజేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలోనే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపైనా సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు మంత్రి సవిత కృతజ్ఞతలు తెలియజేశారు.