తన ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్ డేట్ వెల్లడించిన సమంత

Spread the love


 

ప్రముఖ నటి సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కు అమెరికాలో కూడా చికిత్స చేయించుకున్నారు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్ డేట్ ను సమంత వెల్లడించారు. ట్రీట్ మెంట్ కొనసాగుతోందని, ప్రస్తుతం క్రయోథెరపీ చికిత్స చేయించుకుంటున్నానని సమంత తెలిపారు. 


క్రయోథెరపీతో రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందని, రక్త ప్రసరణ సాఫీగా సాగుతుందని వివరించారు. మానసిక ఉల్లాసానికి ఈ క్రయోథెరపీ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ చికిత్సలో భాగంగా సమంత మైనస్ 150 డిగ్రీల అతి శీతలమైన ఓ టబ్ లో కూర్చున్నారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పోస్టు చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *