తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తా …
జేఏసీ నేతలకు కలెక్టర్ లక్ష్మీ శ భరోసా ..
ప్రెస్‌క్లబ్‌ను అందరిదిగా మార్చండి…అంటూ కలెక్టర్‌కు వినతిపత్రం…
ఏళ్ల తరబడి సాగుతుంది.. తక్షణమే తేల్చండి.
జేఏసీ నేతల విజ్ఞప్తి.. విజయవాడ,ఆగస్టు 4:
మీ ప్రెస్‌క్లబ్ సమస్యను నేను వచ్చిన తరువాత నుంచి వింటున్నానని, మీ సమస్యల పరిష్కారానికి మీకు వెన్నుదండుగా ఉంటానని పూర్తిస్థయిలో పరిశీలించిన జర్నలిస్టులందరికి మేలు జరిగేలా చూస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా భరోసా ఇచ్చారు. సోమవారం ప్రెస్‌క్లబ్ సాధనా జేఏసీ ఆధ్వర్యంలో సేవ్ ప్రెస్‌క్లబ్ పేరిట ముందుగా డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్ ప్రెస్‌క్లబ్ సాధనా జేఏసి నాయకులతో మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌లమీద కలెక్టర్ల పాత్ర ఏ విధంగా ఉందో పరిశీలించి న్యాయం చేసేందుకు సహకరిస్తానని హమీ ఇచ్చారు. దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలపై స్పందిస్తానని మాట ఇచ్చారు. త్వరలో ఇరు వర్గాలను పిలిచి అన్ని పత్రాలను పరిశీలిస్తానని అన్నారు. అనంతరం జేఏసి నేతలు సమస్యను సత్వరం పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
విజయవాడ జర్నలిస్టుల సంక్షేమం కోసం అలనాటి సీనియర్ జర్నలిస్టు పెద్దల నేతృత్వంలో జులై 1971లో అప్పుటి ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి “ప్రెస్ క్లబ్, విజయవాడ” కు శంకుస్థాపన చేశారని, అయితే “ప్రెస్ క్లబ్” మాదే అంటున్న ఏపీయూడబ్ల్యూజే హైదరాబాద్ లో ఏప్రియల్ 1975లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా డాక్యుమెంట్స్ కనబడుతున్నాయనీ సిపి దృష్టికి తీసుకెళ్లారు. 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 1975లో రిజిస్టర్ అయిన ఏపీయూడబ్ల్యూజే కు ఎలా చెందుతుంది, అదేవిధంగా అలనాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995లో ప్రెస్ క్లబ్ పేరు తోనే మొదటి అంతస్తును ప్రారంభించి ఉన్నారనీ, ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో ఉన్న 1971 శిలాఫలకంలో కానీ 1995 శిలాఫలములో కానీ ఎక్కడ కూడా ఏపీయూడబ్ల్యూజే అనుబంధమని ప్రస్తావన రాలేదన్నారు. ఇక ఏపీయూడబ్ల్యూజే చెబుతున్న ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ బేలా 264 / 2018 లో ప్రెస్ క్లబ్ తమ అనుబంధం అంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనీ 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 2018 లో కొంతమంది కలిసి చేసుకున్న రిజిస్ట్రేషన్ ఎలా న్యాయ సమ్మతం అని సాధన సమితి నేతలు కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ విషయంలో గత రెండు సంవత్సరాల క్రితమే అప్పటి సబ్ కలెక్టర్ నివేదికను కలెక్టర్ కి ఇచ్చి ఉన్నారన్నారు.. ఇంతవరకు సబ్ కలెక్టర్ ఇచ్చిన నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కలెక్టర్‌కు వివరించారు. కాబట్టి మీరు కూడా దయచేసి నిజానిజాలు నిగ్గు తేల్చి విజయవాడలోని జర్నలిస్టులకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ ను తమ అదుపులో ఉంచుకున్న ఆ నాయకులు విజయవాడ జర్నలిస్టుల సంక్షేమాన్ని మరచి ప్రెస్ క్లబ్ డబ్బును దారి మళ్లించటమే కాక రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థలకు భారీగా బకాయి పడ్డారన్నారు.. అందులో భాగంగా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ వారు కోటి 82 లక్షలకు పైగా కట్టాలని డిమాండ్ నోటీసిస్తూ ప్రెస్ క్లబ్ ను ఖాళీ చేయవలసిందిగా ఇరిగేషన్ శాఖ నోటిస్ ఇచ్చిందన్నారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ నిర్వాహకులుగా ఉన్న వారు వాటర్ టాక్స్ కట్టకపోతే మున్సిపల్ వారు డిస్ కనెక్ట్ చేశారని, అయితే దానిని అనధికారికంగా ఏపీయూడబ్ల్యూజే నేతలు తిరిగి నీటి చౌర్యానికి పాల్పడ్డారని నాలుగు లక్షల 50 వేలు పెనాల్టీని విధిస్తూ మున్సిపల్ వారు నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా “ప్రెస్ క్లబ్ సొంత బిల్డింగ్” కి మాత్రమే ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు జీవో వర్తిస్తుండగా వారు యూనియన్ పేరు మీద జర్నలిస్టుల సంక్షేమ మరిచి ప్రెస్ క్లబ్ ఆదాయాన్ని వాడుతున్నారని ప్రెస్ క్లబ్ ఆదాయం దుర్వినియోగం అవుతుందనీ వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వారీ ఆడిటే పెద్ద ఉదాహరణ గా పేర్కొన్నారు.. ప్రెస్ క్లబ్ కు 2018 రిజిస్ట్రేషన్ తప్ప దానికి కనీసం బ్యాంక్ ఎకౌంట్ కూడా లేకుండా ప్రెస్ క్లబ్ ఆదాయాన్ని యూనియన్ ఆదాయంగా చూపెట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వ నిధులకు, దాతల ఫండ్స్ కి “ప్రెస్ క్లబ్” అంటూ. జర్నలిస్టుల సంక్షేమం వచ్చేవరకు ఇది యూనియన్ సంబంధించినదని వారు చేస్తున్న వాదనపై విచారణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. విజయవాడలో దాదాపు 1500 పైగా అక్రిడేటెడ్ జర్నలిస్టులు, మరో 500 వరకు వివిధ కేడర్లలో జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రెస్ క్లబ్ కార్యవర్గం కేవలం 122 మందే సభ్యులను, అది కూడా యూనియన్ సభ్యులనే ప్రెస్ క్లబ్ సభ్యులుగా చూపించి కమిటీ ప్రకటించు కున్నారన్నారు. ఆ 122 మందిలో వర్కింగ్ జర్నలిస్టులు అతి తక్కువగా ఉన్నారనీ,. గుంటూరు, కర్నూల్ వారిని కూడా విజయవాడ ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా చూపెట్టారనీ వారు తెలిపారు. అనేక ప్రముఖ పత్రికలకు, ఛానల్ కు, నిజంగా నడుస్తున్న ప్రాంతీయ పత్రికల మీడియా ప్రతినిధులకు మెంబర్ షిప్ లేదనీ,. వారి మెంబర్షిప్ లిస్ట్ మీద కూడా ఎంక్వయిరీ చేసి వర్కింగ్ జర్నలిస్టులో నిర్ధాయించవలసిందిగా కోరారు.దాని పైన మేము అధికారుల దృష్టికి గత మూడు సం. సంవత్సరాల నుంచి తీసుకు వెళ్తూన్నామని.. ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని తక్షణమే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తరహాలో కలెక్టర్‌కు ఉన్న విచక్షణా అధికారాలు వినియోగించి జర్నలిస్టులందరికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో విజయవాడ ప్రెస్ క్లబ్ అందరిదీ సాధన సమితి నాయకులు వీర్ల శ్రీరాం యాదవ్, మహాటివి గాంధీ, కె. ప్రసాద్ బాబు, చందన మధు, కాకుమాను వెంకట వేణు, మరీదు ప్రసాద్ బాబు, వివి రావు, గణపతిరావు , ఐఎఫ్ డబ్ల్యుజే నాయకులు రామకృష్ణ, రంగనాయకులు, అంతరాత్మ శ్రీనివాసరావు, ఎస్ ఆర్, పసుపులేటి చైతన్య, తెలుగుతేజం బాబూరావు, కోటరాజా, కోటేశ్వరరావు, ప్రశాంత్, మానేపల్లి మల్లిఖార్జునరావు, తాడికొండ బాలాజీ, దార్ల ఉదయ్ కుమార్, వల్లూరి రవిశేఖర్, నారా నాగరాజు, నాగార్జున, భాషా, ఆనంద్, దావులూరి దయాకర్, జమలయ్య, భూపతిరాజు రమేష్ కుమార్ రాజు, నరేష్, సుబ్బారావు, విజయ్, చందు, గుంటూరు శ్రీనివాస్, చందారపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.