విజయవాడ
27-07-2025
డా ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి
స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు ఆదివారం నాడు ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ విభాగ అధ్యక్షులు షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో డా ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని డా ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ క్షిపణి శాస్త్రవేతగా, భారత రాష్ట్రపతిగా డా ఏపీజే అబ్దుల్ కలాం భారత దేశానికీ అనేక సేవలందించారని అయన సేవలు మరువలేనివని కొనియాడారు. యువత అందరు అబ్దుల్ కలాం ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి పదవికే వన్నె తీసుకువచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో 41 వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్, వైసిపి మైనారిటీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు