జూ.. ఎన్టీఆర్ ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారు: కొడాలి నాని

4
0

 

  • వైసీపీ రెండోసారి ఘన విజయం సాధించబోతోందని ధీమా
  • లోకేశ్ ను సీఎం చేయడానికి తారక్ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపణ
  • సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను గెంటేస్తారన్న కొడాలి నాని

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ను గోతిలో పాతిపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ పందుల్లా వస్తున్న చంద్రబాబు, ఆయన మిత్రులకు బుద్ధి చెప్పాలని కోరారు. నారా లోకేశ్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారని చెప్పారు. లోకేశ్ ను సీఎం చేయాలనే దురుద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ పై అనేక కుట్రలు చేస్తూ, ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.

పేద ప్రజలకు సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని కొడాలి నాని చెప్పారు. 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రూ. 2.50 లక్షల కోట్లను సంక్షేమ ఫలాలుగా అందించిన జగన్ కోసం ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని అన్నారు. ఎంత మంది ఏకమై వచ్చినా జగన్ ను ఓడించలేరని చెప్పారు. వైసీపీ రెండో సారి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here