జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ మంగళవారం జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముచ్చటించి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని మెరుగైన సాగు విధానాలు అవలంబించడం ద్వారా అధిక ఆదాయం పొందచ్చని ఈ సందర్భంగా సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్ల తోటలు, పూల తోటలు సాగు చేపట్టి సుస్థిర ఆదాయాన్ని పొందడానికి వీలుంటుంది అని.. ఇందుకు స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారును సంప్రదించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పశుపోషణ ద్వారా కూడా అధిక ఆదాయాలను పొందొచ్చని సూచించారు. ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులకు వీలుంటుందని.. ఈ ఉత్పత్తులకు మంచి ధర కూడా లభిస్తుందని ఈ నేపథ్యంలో రైతులు ఆ దిశగా దృష్టిసారించాలని సూచించారు. పీ4కు సంబంధించి ఇంటింటి సర్వే ప్రక్రియను కూడా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.