జిల్లాలో విస్త్రృతంగా పర్యటించిన రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ..

0

ఏలూరు వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేసిన మహిళా కమీషన్ చైర్మన్..

ఏలూరు,జూలై,03: పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ బాధితులకు సత్వరమే న్యాయ పరిష్కారం జరిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ అన్నారు. గురువారం ఏలూరు జిల్లాలో మహిళా కమీషన్ చైర్మన్ విస్త్రృతంగా పర్యటించారు. హనుమాన్ జంక్షన్ లోని శక్తిసదన్, ముసునూరు గురుకుల పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోవున్న వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేశారు. ప్రతి జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రిమారిటల్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. తదుపరి టిటిడి కళ్యాణమండపం వద్దనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను సందర్శించారు. బాధిత మహిళల సహాయంకోసం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ లో మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు ఆమె దిశా, నిర్దేశం చేశారు. వన్ స్టాప్ సెంటర్ తనిఖీ సమయంలో సెంటర్ ద్వారా ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవలపై ఆమె ఆరాతీశారు. నమోదవుతున్న కేసుల రిజిస్టరు, వైద్య సదుపాయం, తదితర అంశాలను పరిశీలించారు. మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల హింసలపై ఒకేచోట అన్నిసేవలు అందించడానికి వన్ స్టాప్ సెంటర్ వెన్నెముకలాంటిదని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలకు అన్యాయం జరగకూడదనేదే కూటమి ప్రభుత్వ ద్యేయమని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ అన్యాయం జరిగితే దోషులకు అదే ఆఖరిరోజని ఆమె పేర్కొంటూ దోషులకు శిక్ష పడే విధంగా పోలీస్ వారికి కూటమి ప్రభుత్వం పూర్తి స్వచ్ఛనిచ్చిందన్నారు. సోషల్ మీడియా వేదికగాఎవరైనా మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళా సాధికారితే ధ్యేయంగా పనిచేస్తూ సమాజంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల దాడులను, అఘాయిత్యాలను నిరోధించేందుకు కమీషన్ కృషి చేస్తుందన్నారు. వన్ స్టాప్ సెంటర్ ద్వారా సేవలు పొందేందుకు, ఫిర్యాదులు అందించేందుకు 181 హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చన్నారు. సమాజంలో యువతలు ఎక్కువగా మోసపూరిత మాటలు సోషల్ మీడియాకు ప్రభావితులై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. గృహహింస, వేదింపులు, మహిళల అక్రమ రవాణా, వరకట్న వేదింపులు, సైబర్ నేరాలు, కిడ్నాప్, బాల్యవివాహాలు, తదితర అంశాలపై క్షేత్రస్ధాయిలో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. కేసులు తగ్గించే విధంగా సంబంధిత సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హనుమాన్ జంక్షన్ లో శక్తిసదన్ లో వుండే బాధిత మహిలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో మహిళా ఉపాధి అవకాశాలు, అవసరమైన సహాయం అందించడం జరుగుతుందన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి. సుజాత, నోడల్ అధికారి స్వరాజ్య లక్ష్మి, సిడిపివో రాజశేఖర్, ఈవో మల్లిక, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ నిర్మల, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పేక్టర్ ఆప్ పోలీస్ ఎం. సుబ్బారావు, తహశీల్దారు గాయిత్రీ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమాచార శాఖ, ఏలూరు వారిచే విడుదలపత్రికా ప్రకటన

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version