జర్నలిస్ట్ పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలి: కలెక్టర్‌ను కోరిన జర్నలిస్టుల సంఘాలు
2025–26 విద్యా సంవత్సరం నిమిత్తం గుంటూరు జిల్లాలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీని అమలు చేయాలని కోరుతూ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (APBJA) నేతలు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ని సోమవారం కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమం ద్వారా వినతిపత్రం అందజేశారు. పిల్లలకు విద్యా హక్కు నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యా సంస్థలపై సమన్వయంతో రాయితీ అమలుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాల సాయికుమార్, APBJA గుంటూరు జిల్లా అధ్యక్షుడు బోస్క సువర్ణ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేశంశెట్టి శ్రీనివాసరావు, చల్లా రవి, పొనుగుబాటి నాగరాజు, సువర్ణ రాజు, బలగం ప్రమోద్, బి.రాజ,లింగినేని అవినాష్, వరదల మహేష్, మదిరి శివ, జూపూడి మురళి, తిరుపతి రెడ్డి, బైసాని శ్రీనివాసరావు, దాసరి పూర్ణ,మామిడాల శ్రీనివాసరావు,హోసన్న తదితరులు పాల్గొన్నారు..