జన సైనికులుగా మారిన చిరు సైనికులు.. జన సేన కండువా కప్పుకున్న వైసిపి కి చెందిన చిరు అభిమానులు..

0

 జన సైనికులుగా మారిన చిరు సైనికులు..

జన సేన కండువా కప్పుకున్న వైసిపి కి చెందిన చిరు అభిమానులు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు చిరంజీవి అభిమానులు జనసేన లో చేరారు.. భవానిపురంలోని  పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్యాలయం లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయ కర్త  అమ్మిసెట్టీ వాసు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.. చిరంజీవి యువత నాయకులు కృష్ణ ప్రసాద్, శ్యాం ప్రసాద్ , జనసేన పార్టీ సమన్వయకర్త అమ్మి శెట్టి వాసు ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు జనసేన లో చేరారు..  

అమ్మి శెట్టి వాసు.

పశ్చిమ లో ప్రస్తుతం వైసిపి లో ఉన్న  ఒకడు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు అంటే అది మెగా పవర్..

ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయి.. అందులో మెగా కులం అంటే అందరూ అంటారు..

మెగా అభిమానులంతా రాజకీయ నాయకులుగా మారాల్సిన సమయం వచ్చింది.

జగన్ పాలనను ప్రశ్నించి, ఎదిరించిన నేత మన పవన్..

సొంత సొమ్మును ప్రజలకు ఖర్చు పెట్టింది కళ్యాణ్..

మెగా అభిమానులంతా ఒక్క తాటి పైకి వచ్చి కూటమి కి పని చేయాలి..

సుజనా చౌదరి గారు అసెంబ్లీ కి వెళ్తే ఈ ప్రాంతం బాగుపడుద్ది. 

రానున్న రోజుల్లో పశ్చిమం మరింత అభివృద్ధి చెందుద్ది..

కూటమి గెలుపు పశ్చిమ నుంచే ఆరంభం..

కూటమి గెలుపు కోసం ఎన్నికల వరకు జన సైనికులు  అందరూ కృషి చేయాలి..

అందరం నిస్వార్థంగా పని చేయాలి.. కార్యక్రమంలో  సుజనా చౌదరి తనయుడు

 యలమంచిలి కార్తీక్, అమ్మి సేట్టి వాసు, లను గజమాల తో సత్కరించారు..చిరు అభిమానులు మధుమస్తాన్, సుగుణ బాబు, రేలంగి బాబ్జీ, గౌరీ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version