జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు
జనసేన పార్టీలో ఆర్య వైశ్య ప్రముఖులు బుధవారం సాయంత్రం చేరారు. చార్టెర్డ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు (విజయవాడ), వైశ్య సత్ర సముదాయం అధ్యక్షులు దేవకీ వెంకటేశ్వర్లు (కనిగిరి), కాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షులు భవనాసి శ్రీనివాస్ (నంద్యాల) బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు, అవినీతి రహిత పాలనకు ఆకర్షితులై జనసేనలో చేరినట్టు వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, సిద్ధాంతాలు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.