తమ్మారెడ్డి భరద్వాజా బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారే. నిర్మాతగా .. దర్శకుడిగా అనుభవాన్ని సంపాదించుకున్నవారే. అలాంటి ఆయన చిరంజీవి కెరియర్ తొలినాళ్లలో ఆయనను హీరోగా పెట్టి ‘కోతలరాయుడు’ సినిమాను నిర్మించారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.
“చిరంజీవిని హీరోగా పెట్టి ‘కోతలరాయుడు’ సినిమాను నిర్మించడం మొదలుపెట్టాను. ఇప్పుడు చిరంజీవి మిత్రులుగా ఉన్నవాళ్లు .. అప్పట్లో నాకు మిత్రులు. వాళ్లంతా కూడా చిరంజీవి హీరో ఏమిటి? ఆయనను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారు? ఆయన తప్ప ఎవరూ దొరకలేదా? అన్నవారే.
” చిరంజీవి బాగా చేస్తున్నాడనే విషయం నాకు అర్థమైపోయింది. అయినా వీళ్లంతా ఎందుకు ఇలా అంటున్నారనే ఒక ఆలోచన ఉండేది. అయినా పంతంతో ఆ సినిమాను తీస్తూ వెళ్లాను. ఆ సినిమా ఎంత హిట్ అయిందనేది అందరికీ తెలిసిందే. ఆ తరువాత చిరంజీవితో సినిమా చేయడం నాకు కుదరలేదు. ‘ఊర్మిళ’ సినిమాలో ఒక గెస్టు రోల్ చేయమని అడిగానుగానీ, ఆ ఆయనకి కుదరలేదు” అని చెప్పారు.
Spread the love NTR జిల్లా / నందిగామ నియోజకవర్ రిపోర్టర్ మన్మమధరావు చంద్రబాబు అబద్ధపు హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టండి గతంలో 650 హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేసి విధానాన్ని.ప్రజలకు వివరించండి జగనన్న ప్రభుత్వం […]
Spread the loveనగర పరిశుభ్రతకు పారిశుధ్య కార్మికులు వెన్నుముక లాంటి వారు నగర పరిశుభ్రతకు పారిశుధ్య కార్మికులు వెన్నుముక లాంటి వారని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం ఉదయం […]
Spread the love రాష్ట్రంలో జైనులను గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ –జైనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక రూపాల్లో మేలు చేసింది రాష్ట్రంలో జైనులను గుర్తించి వారికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి […]