తమ్మారెడ్డి భరద్వాజా బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారే. నిర్మాతగా .. దర్శకుడిగా అనుభవాన్ని సంపాదించుకున్నవారే. అలాంటి ఆయన చిరంజీవి కెరియర్ తొలినాళ్లలో ఆయనను హీరోగా పెట్టి ‘కోతలరాయుడు’ సినిమాను నిర్మించారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.
“చిరంజీవిని హీరోగా పెట్టి ‘కోతలరాయుడు’ సినిమాను నిర్మించడం మొదలుపెట్టాను. ఇప్పుడు చిరంజీవి మిత్రులుగా ఉన్నవాళ్లు .. అప్పట్లో నాకు మిత్రులు. వాళ్లంతా కూడా చిరంజీవి హీరో ఏమిటి? ఆయనను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారు? ఆయన తప్ప ఎవరూ దొరకలేదా? అన్నవారే.
” చిరంజీవి బాగా చేస్తున్నాడనే విషయం నాకు అర్థమైపోయింది. అయినా వీళ్లంతా ఎందుకు ఇలా అంటున్నారనే ఒక ఆలోచన ఉండేది. అయినా పంతంతో ఆ సినిమాను తీస్తూ వెళ్లాను. ఆ సినిమా ఎంత హిట్ అయిందనేది అందరికీ తెలిసిందే. ఆ తరువాత చిరంజీవితో సినిమా చేయడం నాకు కుదరలేదు. ‘ఊర్మిళ’ సినిమాలో ఒక గెస్టు రోల్ చేయమని అడిగానుగానీ, ఆ ఆయనకి కుదరలేదు” అని చెప్పారు.
Spread the loveఎన్టీఆర్ జిల్లా, మే 09, 2024 ప్రజాస్వామ్య పరిరక్షణ ధీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచిన 99 ఏళ్ల అడుసుమిల్లి వేణుగోపాలరావు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న సంకల్పానికి అడుసుమిల్లి […]
Spread the loveఅహ్మదాబాద్లో ఎర్త్ సమ్మిట్–2025లో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మరియు ఇతర డిసిసిబి చైర్మన్ తో కలిసి పాల్గొన్న మాజీమంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య […]