చింతామోహన్,కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్.

0

ఒంగోలు,
19-7-2025,
శనివారం.

చింతామోహన్,
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్.

రాజధాని.

ఒంగోలు దగ్గర దొనకొండలో రాజధాని పెట్టమని శివరామన్ కృష్ణన్ కమిటీ చెప్పింది.

లక్ష ఎకరాలు ప్రభుత్వ భూములు దొనకొండ ప్రాంతంలో ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు కి బంధు ప్రీతి ఎక్కువ. దొనకొండకు రావాల్సిన రాజధాని రాకుండా చేసి, అమరావతిలో ప్రారంభించారు.

70000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు. ఆ రైతులకు ఇప్పటివరకు న్యాయం చేయలేదు.

1000 ఎకరాలు చాలు రాజధాని కట్టేందుకు.

చెన్నైలో రాజధాని కట్టారు. హైదరాబాదులో రాజధాని కట్టారు. భువనేశ్వర్ లో రాజధాని వుంది.

అమరావతి లాగా 70000 ఎకరాలు భూములు తీసుకోలేదు అక్కడ.

కృష్ణా నది తీరంలో మూరెడు మట్టి తీస్తే, చారెడు నీళ్లు వస్తది.

నీళ్లలో 50 అంతస్తుల సచివాలయం భవనం కట్టితే, భవిష్యత్తులో కూలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?

దేశంలోనే కాదు, ప్రపంచంలోనే 50 అంతస్తుల సచివాలయం భవనం లేదు.

ఒంగోలు నుంచి, కర్నూలు దాకా ఉన్న జిల్లాల ప్రజలు అమరావతిని ఇష్టపడడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషంగా లేరు.

విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం వుంది. 30 కిలోమీటర్ల దూరంలో గుంటూరులో 5000 ఎకరాల్లో మరో విమానాశ్రయం ఎందుకు??

ప్రాజెక్టులు

పోలవరం, తెలుగు గంగ, కాలేరు- నగరి, హంద్రీ- నీవా, SLBC ఇప్పటి దాకా పూర్తి కాలేదు.

పోలవరం ప్రాజెక్టు పూర్తికాకముందే, బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు.

మొబలైజేషన్ అడ్వాన్సుల్లో కమీషన్ల కోసమే బనకచర్ల ప్రాజెక్టు.

చంద్రబాబు నాయుడు మాట కారేకాని, చేతకారి కాదు.

ఉత్త మాటలు చెప్తాడు. రోజుకో కొత్త స్లోగన్ ఇచ్చి, ప్రజలను మభ్యపెడుతున్నాడు.

లక్ష కోట్ల స్కామ్

2జి స్పెక్ట్రమ్ స్కాం, బొగ్గు స్కాం కంటే కూడా బ్యాంకు రుణాల మాఫీ స్కాం వెయ్యింతలు పెద్దది.

14 50 లక్షల కోట్ల రూపాయలు NPA లు మాఫీ చేశారు. ఇందులో లక్ష కోట్లు అవినీతి జరిగింది.

సూత్రధారులు ఎవరు?? పాత్రధారులు ఎవరో తేల్చాలి.

గుజరాత్ రాష్ట్రంలో, ఏపీలో, రాష్ట్రాల్లో ఎంతెంత రుణ మాఫీ చేశారో నిర్మల సీతారామన్ చెప్పాలి.

హత్యలు – దాడులు.

దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదు.

1985 కారంచేడు లో జరిగిన హత్యాకాండ పర్వం వీటికి కొనసాగుతోంది.

ఏపీ హైకోర్టులో నిన్న దళిత అడ్వకేట్ల పై దాడి జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు.

తెనాలిలో ఎస్సీ యువకులను పోలీసుల చేత ప్రభుత్వం అత్యంత దారుణంగా కొట్టించింది.

అరకులో ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు గిరిజనుల పురుషాంగాలను కోస్తున్నారు.

పాఠశాలలు – స్కాలర్షిప్లు
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా అందరికీ విద్య అనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో పాఠశాలలు ప్రారంభించాము.

ఏపీలో 35వేల పాఠశాలలో ఉన్నాయి. ఆ సంఖ్యను పది వేలకు తగ్గించాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.

మధ్యాహ్న భోజనం సోనియా గాంధీ, యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 18 కోట్ల మంది భోజనం చేయగలుగుతున్నారు.

మధ్యాహ్న భోజనం ఆపితే, పాఠశాలల సంఖ్య తగ్గిస్తే ఉద్యమిస్తాం.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు సరిగ్గా రావడం లేదు.

పేరుకే ఎస్సీ కార్పొరేషన్లు. నిధులు లేదు. నిరుద్యోగులకు రుణాలు రావడం లేదు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version