ఏలూరు,
7-8-2025
గురువారం.
చింతామోహన్,
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్.
గ్రామ పంచాయితీలు -కార్పొరేషన్లు
గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. సర్పంచులు అల్లాడుతున్నారు.
వీధిలైట్లు, రోడ్లు వేసుకునేందుకు డబ్బులేక, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పదేళ్ల క్రితం ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉంది. అభివృద్ధి లేదు.
లిక్కర్ స్కామ్
ఏపీలో లిక్కర్ కుంభకోణం వాస్తవం. వందల కోట్ల రూపాయలు తిన్నారు.
లిక్కర్ కేసులో ఎవరు ఉన్నా, ఎంత పెద్ద వాల్లైనా, వారికి శిక్షలు తప్పదు.
బిల్లులు లేకుండా, లిక్కర్ అమ్మకాలు జరిగాయి.
ఆల్ ఇండియా మొలాసిస్ బోర్డు కు నేను చైర్మన్గా పనిచేశాను. లిక్కర్ గురించి పూర్తి అవగాహన ఉంది.
ఒక బాటిల్ లిక్కర్ తయారీకి, ఇరవై, లేదా ముప్పై రూపాయలు ఖర్చవుతుంది.
కానీ మార్కెట్లో భారీ రేట్లకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
పొలిటిషియన్లు, మ్యాన్ ఫ్రాక్చర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సైజ్ అధికారులు డబ్బు దోచుకుంటున్నారు.
లిక్కర్ అమ్మకాలు వల్ల, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబాల్లో విభేదాలు ఏర్పడ్డాయి.
పేద ప్రజల లివర్, కిడ్నీలు చెడిపోతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి.
ప్రభుత్వానికి రెవెన్యూ కోసం పేదల పుట్టగొట్టొద్దు. ఆదాయం కావాలంటే పెద్దల పొట్ట కొట్టండి తప్పులేదు.
వారానికో, లేదా నెలకు ఒకటి, రెండు రోజులు మద్యం అమ్మకాలు జరిపితే బాగుంటుంది.
రాజధాని.
రాజధాని కోసం 1000 ఎకరాలు చాలని, కామ్రేడ్ బి.వి.రాఘవులు చెప్పారు.
70 వేల ఎకరాలు భూములు తీసుకుంది కూటమి ప్రభుత్వం.
రైతుల భూములతో, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది.
ఒకాయన బయట రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకు ఫోన్లు చేస్తున్నాడు. మీకు 100 ఎకరాలు ఇస్తాం. మాకేం ఇస్తారు? అని అడుగుతున్నారు.
భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. రైతులను దగా చేశారు.
ఒక రైతు 90 ఎకరాలు ఇచ్చాడు. ఎందుకిచ్చావయ్యా? అని అడిగితే, మా ఖర్మకొద్ది ఇచ్చామని బాధతో, వాపోయాడు.
అన్యమతం – అంటరానితనం.
ఈ మధ్యకాలంలో అన్యమతం అనే నినాదం బాగా వినిపిస్తోంది.
తిరుపతి లో ఒక నిరుపేద మహిళ ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. ఆమె తన ఇంట్లో బైబిల్ చదువుతోందనే సాకుతో ఉద్యోగం నుంచి తీసేశారు.
సెక్యులర్ దేశంలో, రాజ్యాంగానికి విరుద్ధంగా, ఇలాంటి చర్యలు జరగడం సిగ్గుచేటు.
ఎప్పుడూ కనపడని అంటరానితనం పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టీటీడీలో అంటరానితనం ఉంది. ఎస్సీ ఆఫీసర్లు ఆలయంలో లేరు.
ఎస్టీల పరిస్థితి చెప్పుకోలేని స్థితిలో వుంది. అరకులో ఖనిజాలు ఉన్నాయి. దోచుకోవడం కోసం కొంతమంది పెద్దలు రాక్షస పనులు చేస్తున్నారు.
ఎస్టీ పురుషుల పురుషాంగాలను మహిళల ముందే కోస్తున్నారు. గిరిజనులను ఆ ప్రాంతాల నుంచి తరిమేసి, ఖనిజ సంపద కొల్లగొట్టడం కోటీశ్వరుల కుట్ర.
చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందా?? ఓబీసీలకు పెద్దపీట వేసినట్లా??
అయోధ్యలో రామాలయం, గుజరాత్ లో 125 అడుగుల పటేల్ విగ్రహం, బ్యాంకు రుణాల మాఫీలో లక్ష కోట్ల అవినీతి. 11 సంవత్సరాల బిజెపి పాలనలో సాధించింది.
చంద్రబాబు – జగన్
చంద్రబాబు నాయుడు పెద్ద స్థాయికి పోతాడని నేను ఊహించాను.
ఆంధ్రప్రదేశ్ ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడని అనుకున్నాను. జరగలేదు.
ఒకటిన్నర సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.
సిటీల్లో జగన్ ఊసే లేదు. కొండేపి, దర్శి, దొనకొండ, మార్కాపురం వంటి మాస్ ప్రాంతాల్లో కొంచెం పట్టు ఉంది.
పత్రికా స్వేచ్ఛ.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛ ఉండేది. బిజెపి పాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు.
మీడియా సంస్థల అధిపతులకే పత్రికా స్వేచ్ఛ ఉంది.
11 సంవత్సరాల్లో ప్రధాని ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు??