కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ముద్రగడ అలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి ముందు నుంచి తన కారులో వెళ్తూ అక్కడ తన వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో చంద్రబాబు, కేంద్రమంత్రి షెకావత్, జనసేనాని పవన్ కల్యాణ్ లు చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఇంటి ముందు పాల్ కాసేపు హల్ చల్ చేశారు. పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏమీ ఆశించడం లేదని పాల్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారని చెప్పారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు చేశారని విమర్శించారు. పాలన అంటే సినిమాలో డ్యాన్సులు చేయడం కాదని ఎద్దేవా చేశారు. కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా ఏపీని మోసం చూస్తూనే ఉందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీకి బుద్ధి చెపుతారని అన్నారు. సినీ నటుడు, సీనియర్ లీడర్ బాబూ మోహన్ కూడా తమ పార్టీలో చేరారని… మరింత మంది కీలక నేతలు తమ పార్టీలో చేరాలని ఆయన కోరారు.
Spread the love కొత్తూరు తాడేపల్లి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచారం లో భాగంగా సోమవారం రాత్రి గ్రామస్తులు అపూర్వమైన ఆదరణ చూపి అత్మీయ […]
Spread the love జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. పవన్ సినిమా అత్తారింటికి దారేది డైలాగ్ కు పేరడీ వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. ‘ఎక్కడ నెగ్గాలో […]
Spread the love కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం కొనసాగుతున్న కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ సునీత *ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు […]