చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మంచుకొండ చక్రవర్తి

Spread the love

 చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు- మంచుకొండ చక్రవర్తి

చంద్రబాబు మోసపూరిత హామీలు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచు కొండ చక్రవర్తి ఆ పార్టీ నాయకులను చెప్పారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను, టీడీపీ అభ్యర్థి బొండా ఉమాను టీడీపీ కేడరే నమ్మడం లేదన్నారు.  

ఎన్నికల ప్రచారంలో భాగం గా 31వ డివిజన్ ముత్యాలంపాడు సాయిబాబా గుడి ప్రాంతాలలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి, ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ అల్లుడు కాజా రఘునాథం, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంలతో కలిసి ఆయన పర్యటించారు. ముత్యాలంపాడు సాయిబాబా గుడి వద్ద నుండి పలు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభ్వుం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలను ప్రజలకు వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. అనంతరం చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ 2014లో మాదిరిగా ఆచరణకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్లీ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మనం వెంకటేశ్వరవు, ప్రసాద్, కె. వెంకటేశ్వరరావు, అంగిరేకుల సాయి, సీతారామరాజు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *