గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో నింధితుడి అరెస్ట్ .

0

అస్సిస్టెంట్ పోలీసు కమిషనర్ వారి కార్యాలయము, సౌత్ డివిజన్, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ
తేదీ.18.07.2025.

గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో నింధితుడి అరెస్ట్ .

 ది 16.07.2025వ తేదీ మధ్యాహ్నం  సమయంలో గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్సరా ధియేటర్ వెనుకవైపు ఉన్న రూంలో  హత్యలు జరిగిందని రాబడిన సమాచారం మేరకు వెంటనే గవర్నర్ పేట సిఐ  వారి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని నేర స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించడం జరిగింది. అనంతరం క్రైమ్ నెంబర్ 71/2025 u/s 103(1) BNS గా కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించడం జరిగింది.

సదరు సంఘంటనను తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ఈస్ట్ ఇన్ ఛార్జ్ డి.సి.పి. కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి వారి సూచనలతో సౌత్ ఏ.సి.పి. డి.పావన్ కుమార్ పర్యవేక్షణలో గవర్నర్ పేట సి.ఐ. నాగ మురళి వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్నానాన్ని ఆధారంగా చేసుకుని అనుమానితుడి కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపధ్యంలో ఈ రోజు సదరు ప్రత్యేక బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు గవర్నర్ పేట సి.ఐ. అడపా నాగ మురళి , ఎస్.ఐ .దుర్గారావు వారి సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎగ్జిట్ గేట్ వద్ద అనుమానిత వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విజయవాడ తీసుకురాగా అనంతరం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ నందు విచారించి, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

నిందితుడి వివరాలు :

  1. విజయవాడ, నైజం గేటు, వించిపేట ఏరియాకు చెందిన జమ్ము కిషోర్ (42 సం)

వివరాల్లోకి వెళితే ….
నిందితుడు జమ్ము కిషోర్ గత కొంతకాలంగా భార్యతో గొడవపడి దూరంగా ఉంటున్నాడు, గతంలో ఇతనిపై ఒక హత్య కేసుతో కలిపి 08 కేసులు కలవు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రాము అనే ఒక మేస్త్రి వద్ద ఉంటూ వివిధ హోటల్స్ లలో క్యాటరింగ్ పనిచేస్తూన్నాడు, మేస్త్రి రాము బయట నుండి వచ్చి తన వద్ద పనిచేసే వారి కోసం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్సరా ధియేటర్ వెనుకవైపు రూంలను అద్దెకు తీసుకున్నాడు, పనికి వచ్చిన వారు ఆ రూం లలో ఉండేవారు, ఈ క్రమంలో కిషోర్, నాగరాజు మరియు హతులైన రాజు, వెంకటరావు లు కలిసి ఒక రూం లో ఉండేవారు. అప్పుడప్పుడు మధ్యం మత్తులో రూమ్ లో చోటు విషయంలో, డబ్బుల విషయంలో కిషోర్, రాజు, వెంకటరావు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల నేపథ్యంలో కిషోర్ ను రాజు, వెంకటరావులు రూం నుండి పంపించేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిసి ఏవిధంగా నైనా వారి అడ్డు తొలగించుకోవాలని ఉద్దేశపూర్వకంగా వంట పనులు చేయు సమయంలో ముందుగానే కత్తిని తనతో తెచ్చుకుని రూంలో పెట్టి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ది.16.07.2025 తేదీన సుమారు 12.30 గంటల సమయంలో రూంలో రాజు వెంకటరావు లు ఉండటం గమనించిన కిషోర్ వారితో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని ముందుగా రూంలో ఉంచిన కత్తితో రాజు ను మరియు వెంకటరావులను విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసినాడు. ఈ క్రమంలో ఆపడానికి వచ్చిన నాగరాజు,బాషాలను తోసివేసి అక్కడ నుండి పారిపోయినాడు. అక్కడ నుండి ట్రైన్ లో సికింద్రాబాద్ వెళ్లిపోయినాడు.

    ఈ జంట హత్యల కేసు ను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన గవర్నర్ పేట సి.ఐ. అడపా నాగ మురళి ని, వారి సిబ్బందిని అధికారులు అభినంధించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version