గవర్నర్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

0

 గవర్నర్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

78వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదిమంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ యూనివర్సిటీ నుంచి న్యూఢిల్లీలో 40 రోజులు పాటు పెరేడ్ చేసి 78వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర   గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫ్రీ రిపబ్లిక్ పెరేడ్ కంటిన్జెంట్  లీడర్ మరియు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాట్లాడుతూ మన రాష్ట్ర గవర్నర్ కి కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్   సయ్యద్ అబ్దుల్ నజీర్  మాట్లాడుతూ మీరందరూ రేపటి భావిభారత పౌరులుగా దేశానికి సేవలందించాలని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర ప్రతిష్ట కోసం కృషి చేసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version