గన్నవరం నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలం వెన్నుతుల గ్రామంలో పామర్తి సుబ్బారావు తన స్నేహితులతో కలిసి స్థాపించిన (యూపిఎస్) యూనివర్సల్ ప్రింట్ సిస్టమ్ కంపెనీని లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత కంపెనీ ఆవరణలో ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా యార్లగడ్డ మాట్లాడుతూ స్నేహితులతో కలిసి ప్రారంభించిన ఈ కంపిని వృద్ధిలోకి రావాలని అన్నారు. యుపిఎస్ యూనివర్సల్ ఫ్రెంట్ సిస్టం కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ సూరంపల్లి గ్రామంలో ఇటు వెన్నూ తల గ్రామంలో ఈ కంపెనీని ప్రారంభించడం శుభపరినామమని దీనివలన ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని ఆ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించి న యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజవర్గం అభివృద్ధి గా అడుగులు వేస్తుందని ఇప్పటికే మల్లవల్లి పారిశ్రామిక వాడలో మంచి మంచి కంపెనీలు రావటంతో ఎంతోమందికి ఉపాధి కలిగిందని అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు లోనే జీడిమెట్ల లాగా మల్లవల్లి కూడా మంచి కంపెనీలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కి తలమానికంగా ఉంటుందని ఆయన అన్నారు గన్నవరం నియోజవర్గం అభివృద్ధి ఎజెండగా పనిచేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు ఎన్నికల ముందు యువతకి ఉపాధి కల్పిస్తానని చెప్పా అదే దిశగా పనిచేస్తున్న తన నియోజకవర్గంలో ఎవరు కంపెనీ ఏర్పాటు చేస్తానన్నా నేను సహకరిస్తా అని ఆయన అన్నారు అలాగే గ్రామాల్లోని రైతు సోదరులు చెరువుల మట్టిని పొలాల్లోకి మెరక చేసుకోవడానికి అవకాశం వచ్చిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు, సమీప గ్రామాల ప్రజలు కంపెనీ ప్రతినిధులు, యాజమాన్యం పాల్గొన్నారు.