కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
కొండపల్లిలో ఎంపీ చిన్ని కి, ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి ఘనస్వాగతం.
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 19.07.2025.
ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని విధాలుగా కొండపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సభ్యులతో సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) శాసనసభ్యులు కృష్ణప్రసాదు శనివారం పాల్గొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ని సత్కరించారు. కొండపల్లిలో నాల్గవ వార్డులో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ కొండపల్లి పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు అమృత్ 2.0 పథకంలో రూ.57.12 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో ఇంటింటికీ కుళాయి ఇవ్వాలనే నాలుగున్నర దశాబ్దాల కల ఈ పథకం ద్వారా త్వరలో సాకారం కాబోతుందన్నారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.
కొండపల్లిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీసీ రోడ్లను నిర్మాణంతో మౌలిక వసతులు మెరుగు పర్చుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రథమ సమావేశంలో రూ.5 92 కోట్ల పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించడం శుభపరిణామన్నారు. కౌన్సిల్ పాలకవర్గం అంతా నిత్యం ప్రజల్లో మమేకమై వారి సమస్యలకు సత్వరం పరిష్కారం లభించే విధంగా సేవలందించాలన్నారు.
విజయవంతంగా ‘సుపరిపాలనలో తొలిఅడుగు’
‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం కూడా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతంగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనకు, ఎన్డీఏ కూటమి పాలనకు ఉన్న తేడాను ప్రజలకు అర్ధమయ్యే విధంగా తెలియజేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి మన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో దార్శనికులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సమగ్రాభివృద్ధికి శ్రమిస్తున్నారని అన్నారు.
ఎంపీ కి, ఎమ్మెల్యే కి ఘనస్వాగతం.
కొండపల్లి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కి ఘనస్వాగతం లభించింది. ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, అభిమానులు వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలను ఇచ్చి ఘనంగా స్వాగతించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.