2-8-2025
కుందా వారి కండ్రిక గ్రామంలో పాడి పరిశ్రమ పరంగా పాల కేంద్రంలో అత్యధికంగా పాలు పోస్తున్న రైతులను సత్కరించిన – MLA బొండా ఉమ
కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా సబ్సిడీ చెక్కులను – MLA బొండా ఉమ అందజేశారు
ధి:-2-8-2025 శనివారం ఉదయం 10:00″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గం లోని 64వ డివిజన్ కుందా వారి కండ్రిక సొసైటీ వద్ద కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఆగస్ట్ 2న అమలు చేయాలని నిర్ణయించింది, అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు రైతులకు అన్నదాత సుఖీభవ పి యం కిసాన్ నగదు చెక్కులను అందజేసి రైతులకు శుభాకాంక్షలు తెలియజేసారు…
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ రైతాంగ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నదాత సుఖీభవ, పి యం కిసాన్ కార్యక్రమం ద్వారా లక్షలాదిమంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేని తనంతో వైయస్సార్సీపి నాయకులు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా ప్రజా ప్రయోజనాలను కాలరాస్తున్నారు అని…
రైతుల శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 14000, కేంద్ర ప్రభుత్వం ఆరువేలు కలిసి ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం రైతులకు అందిస్తున్నామని, పథకం ప్రారంభం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 46 ,85,838 రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధిని చూసి పులివెందుల MLA జగన్ ఓర్వలేక పోతున్నారని, రాష్ట్రంలో పెట్టుబడిల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూరు, తదితర దేశాలలో పర్యటన చేస్తున్నారనీ, పెట్టుబడులు రాకుండా కంపెనీలకు వైఎస్ఆర్సిపి కి చెందిన వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారన్నారని,
అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు,
బుడమేరు వరద విషయంలోనూ వైఎస్ఆర్సిపి దుష్ప్రచారం చేస్తోందని, భవిష్యత్తులో బుడమేరు వరద జనావాసాలలోకి రాకుండా ప్రభుత్వం అన్ని పటిష్ట చర్యలు తీసుకుందని తెలియజేసారు…
ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, నియోజకవర్గ పరిశీలకులు దేవతోటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి SK బాబు,నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, పాలకేంద్రం అధ్యక్షులు పొన్నం శేషగిరి, సాదం శ్రీనాథ్, రాజేష్, కంకణాల బాబు, కోరాడ రమణ, వింజమూరి సతీష్, పలగాని భాగ్యలక్ష్మి, నాగరాజు, తేల భవాని, మందాల రామారావు, పంగిడియ తదితరులు పాల్గొన్నారు