విజయవాడ
25-07-202
స్థానిక 41వ డివిజన్ ప్రెసిడెంట్ వీధి వద్ద స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ 41వ డివిజన్ విస్తృత స్థాయి సమావేశాలని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంఛార్జ్ లు కేసరి కృష్ణా రెడ్డి, ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాబు మోసాలను, ప్రజలకు ఇచ్చిన బాండ్లు, వైయస్ జగన్ గారి ప్రెస్ మీట్ ని టివిలో చూపించారు. ఇంటింటికి క్యూ ఆర్ కోడ్ తో వెళ్లి ప్రజలతో ఆ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేపించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూ ఆర్ కోడ్ ని ఆవిష్కరించారు
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తాడని ఎన్నికలు అయ్యాక వాటిని అమలు చేయకుండా నిధులు సరిపోవని, గత ప్రభుత్వాలపై నిందలు వేసి పక్కకు తప్పుకోవడం చంద్రబాబు కి అలవాటని అలాగే 2024 లో కూడా అనేక వాగ్దానాలు చేసాడని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసిపి హయాంలో ప్రతి గడపకు వెళ్లి ఇచ్చిన హామీలు అమలు చేసిన సంక్షేమ పధకాలు అందాయ లేదా అని ప్రజలనడిగి తెలుసుకొని రానివాళ్ళకి అక్కడికక్కడే పరిష్కారం చేసామన్నారు. ఎన్నికల ముందు టిడిపి నేతలు ఇంటింటికి తిరిగి జగన్ గారికి కంటే ఎక్కువ పధకాలు ఇస్తామని మోసపూరిత హామీలతో ప్రజల వద్దకు వెళ్లారని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటె అంతమందికి అమ్మఒడి వస్తుందని, చదువు పూర్తయిన విద్యార్థికి నిరుద్యోగభృతి ఇస్తామని, 50 ఏళ్ళు దాటిన వారికీ పెన్షన్ వస్తుందని,18 ఏళ్ళు దాటితే ప్రతి మహిళకు నెల 15 వందలు ఇస్తామని ఈ పధకాలు అన్ని కలిపి ఎంత లబ్ది చేకూరుతుందో ముద్రించిన పత్రం ప్రజలకు ఇచ్చారని వాళ్ళు ఈ పధకాలు అర్హత పొందారని జూన్ 24 నుంచే ఈ పధకాలు ఇచ్చేస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ త్రికరణ శుద్దితో అన్నిసొంతకాలు పెట్టి పత్రాలు ఇచ్చారన్నారు. గతంలో చంద్రబాబు మాటలు చెప్పాడు ఇప్పుడు కాగితం రూపంలో ఇచ్చాడు ఈ సారి నిజంగా అమలు చేస్తాడని ప్రజలు నమ్మారని, జగన్ వస్తే సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తాయని, చంద్రబాబు వస్తే రెండు లక్షల రూపాయలు వస్తాయని ప్రజలు నమ్మారన్నారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి చంద్రబాబు వచ్చాడన్నారు. ఆ దొంగ హామీలన్నీ ప్రజలకు గుర్తుకు చేయడం కోసం చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకుతెస్తూ పేరుతొ ఈ కార్యక్రమాన్ని చెప్పటడం జరిగిందన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు పాత్రలలో పధకాలు వచ్చాయ లేదా అన్ని ప్రజలను అడిగి గుర్తుచేయాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిందని ఇప్పటి వరకు ఏ ఒక్క పధకం అమలు చేయలేదని తల్లికి వందనం అరకొరగా వేశారని వాటిలో కూడా కొంతమందికి 10 వేలు వచ్చాయంటున్నారని, కొంతమందికి 15 వేలు వచ్చాయంటున్నారని ఎవరికీ పూర్తిగా రాలేదన్నారు. క్యూ ఆర్ కోడ్ ని ప్రజల చేత స్కాన్ చేపించి చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసాల వల్ల ప్రజలకు కలిగిన నష్టాన్ని వివరించి అప్లోడ్ చేయాలనీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మహిళలకు నెలకు 15 వందలు ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని అచ్చం నాయుడు అన్నడని. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేడప్పుడు తెలీదా అన్ని కూటమి నేతలని ప్రశ్నించారు. జగన్ గారి హయాంలో ఆంధ్రరాష్ట్రం శ్రీలంక లా మారింది అన్ని కూటమి నేతలు బురద జల్లారని కానీ జగన్ గారి హయాంలో 3 లక్షల కోట్లు అప్పు చేసాడని మొత్తం పథకాలన్ని అమలు చేసాడని కానీ కూటమి వచ్చిన సంవత్సరంలోనే 1 లక్ష 75 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసారని ఏ పధకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితిలో ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం పధకాలు అమలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారని కొనియాడారు. ఇచ్చిన పధకాలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అన్ని దీనికి ఒత్తాసు పలికేది పవన్ కళ్యాణ్, బిజెపి అన్ని అన్నారు. వైసిపి హయాంలో గడప గడపకు చిత్తశుద్ధితో తిరిగి ప్రతి సమస్యని పరిష్కారం చేసామని కానీ నేడు సూపరిపాలన పేరుతో కూటమి నేతలు ప్రజలవద్దకు వెళ్ళినపుడు పెన్షన్ రాలేదని చెపితే నాకు తెలీదు అన్ని మాట దాటేసి వెళ్లిపోతున్నారన్నారు. తల్లికి వందనం రాలేదంటే తెలీదని, ఉచిత గాస్ రాలేదంటే తెలీదని, చేయూత రాలేదంటే తెలీదని కూటమి నేతలు చెబుతున్నారన్నారు. అదే వైసిపి హయాంలో అయితే ఆ వాలంటీర్ ని, సచివాలయ సెక్రటరీని సంబందించిన అధికారిని పిలిచి ఎందుకు రాలేదో అడిగి వాళ్ళకి వచ్చే విధంగా చర్యలు తీసుకునేవిధంగా ఆదేశించేవాళ్లమని అన్నారు. ఉచిత బస్సు పధకం ద్వారా హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉచితంగా బస్సులో ప్రయాణింవచ్చని గతంలో హామీ ఇచ్చారని కానీ నేడు జిల్లా పరిధిలోనే ఉచితంగ ప్రయాణించవచ్చని సన్నాయి నొక్కుడు నొక్కుతున్నారన్నారు. ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను, బాండ్లను చూపించి ప్రశ్నించే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాలలో పదవులు పొందిన వారు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు