కాజల్ తో అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని

0

 


టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ కు ఒక షాకింగ్ ఘటన ఎదురయింది. హైదరాబాద్ లో ఒక వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి కాజల్ వెళ్లింది. ఈ సందర్భంగా కాజల్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు దూసుకొచ్చారు. 


అయితే ఇదే అదనుగా భావించిన ఓ అభిమాని ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. సెల్ఫీ కావాలంటూ దగ్గరకు వచ్చి ఆమె నడుము భాగంపై చేయి వేశాడు. దీంతో, ఒక్కసారిగా షాక్ కు గురైన కాజల్ ఏమిటిది అని అతనిపై అసహనం వ్యక్తం చేసింది. వెంటనే, పక్కనే ఉన్న బౌన్సర్లు ఆకతాయిని పక్కకు లాగేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ… అభిమానులు అంటే తనకు సొంత కుటుంబంతో సమానమని చెప్పారు. 

ఇదిలావుంచితే, కాజల్ ఒక బిజినెస్ మేన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సత్యభామ, ఇండియన్2 సినిమాలతో బిజీగా ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version