కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన

0

 


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసం… ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. ఎవరైనా సరే బెయిల్ కోసం తొలుత కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. 


తన అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను… గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు ధర్మాసనం జత చేసింది. కేవలం రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని తెలిపింది. 


ఇదే విషయంపై దాఖలైన మరో పిటిషన్ తో కలిసి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషన్ లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తామన్న ధర్మాసం… ఈడీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version