
కమీషనర్ ని కలిసిన నగర పాలక సంస్థ CPS ఉద్యోగులు
2004 లో పించను విధానం ఆగిపోయి cps విధానం అమలు లోకి వచ్చిన నాటి నుండి నగర పాలక సంస్థ నందు నియమితులు అయిన ఉద్యోగులు మంగళవారం ఉదయం కమీషనర్ ధ్యానచంద్ర ను తమ ఛాంబర్లో కలిసి వారికి రావలసిన ఆరియర్ అమౌంట్ గురించి తెలిపి,వినతి పత్రం సమర్పించారు.
2019 నుండి2025 మధ్య కాలం నందు వచ్చిన 8 DA లలోVMC GENERAL FUND నుండి రావలసిన 27 నెలలకు సంబందించిన బకాయి(ARREAR) బిల్లులుCPS మరియుOPS (PF)ఉద్యోగులకి విడి విడి గా చేసుకొనుటకు అనుమతి ఇవ్వమని, ఈ 8 DA లకు సంబందించి బకాయి(ARREAR) బిల్లులుCPS మరియుOPS (PF)ఉద్యోగులకి విడి విడి గా చేసుకొనుటకుCFMS and NIDHI పోర్టల్వారితో మాట్లాడి ఆప్షన్ ఇవ్వనని, 2004 నుండి 2019 (MARCH) మధ్య కాలము నందు అపాయింట్ అయిన ఉద్యోగులకి జీతం నుండి రికవరీచేసిన CPS అమౌంట్ PRAN అకౌంట్స్ నందు జమచేయ వలెనని, 2004 TO 2019 (MARCH) మధ్య కాలము నందువచ్చినDA and PRC బకాయి(ARREAR) నందు మినహాయించిన CPS అమౌంట్ కు సంబందించిన బిల్లులు చేసుకొనుటకు అనుమతి తో పాటు ఈ అమౌంట్ PRAN ACCOUNTS నందు జమచేయ వలెనని కమిషనర్ ను కోరారు.
ఈ విషయముల పై కమీషనర్ స్పందించి వెంటనే అదనపు కమిషనర్ జనరల్ ఇంచార్జ్ Dr.D.చంద్ర శేఖర్గారిని ఒకసారి సమిక్షించ మని ఆదేశించి, తిరిగి శుక్రవారం కమీషనర్ తానే స్వయం గా సంబందిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య ని పరిష్కరిస్తానని అన్నారు.
![]()
