ఒక్క రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

0

31-05-2025

ఒక్క రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఈ నెల 1వ తేదీ ఆదివారం రావడంతో, ఒక్క రోజు ముందుగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొని, లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే MLA బొండా ఉమ పెన్షన్లు అందించడం జరిగింధిధి:-31-5-2025 శనివారం ఈరోజు ఉదయం 9:00″గం లకు”27 గులాబీ తోట ఘనపతి వీధి మరియు 28 డివిజన్ పునూరి సుబ్బారామి రెడ్డి నగర్ వద్ద NTR భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడమైనదిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు సచివాలయ సిబ్బంది, అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించడమైనదిఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని నెరవేర్చడం జరుగుతున్నదనిఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని, ఒకటో తారీకు ఆదివారం రావడంతో ముందు రోజే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసి, గతంలో 200 ఉండే పెన్షన్ ను 2000 చేసినది నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం మని, తిరిగి ఈరోజు 3 వేల రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ను 4000 రూపాయలు ఇంటి వద్దకే ఉదయం  6:00″గం కల్లా” నేరుగా లబ్ధిదారులకు అందజేస్తామని ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నామనిముఖ్యంగా వికలాంగులు మూడువేల రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ ను 6000 రూపాయలు అందజేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందే విధంగా ఉన్నదని, అలాగే వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల రూపాయలు వారి మందులకు గాని ఇంట్లో ఇతర అవసరాలకు గాని ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని…అలాగే రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు నుంచి “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ రేటు – 1200/- సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అంటే 3600, ఐదు సంవత్సరాలకు –  18000 విలువ గల గ్యాస్ సిలిండర్లు ఉచితం గా NDA కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనున్నది అనిఅలాగే రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలకు అనేకం అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం మరల టిఫిన్ అందజేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి దక్కుతుందని బొండా ఉమ తెలియజేసారుఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, 27వ డివిజన్  ఇంచార్జి నవనీతం సాంబశివరావు, 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, డివిజన్ అధ్యక్షులు దాసరి జయరాజు, గొర్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి పవన్, మల్లంపాటి సురేష్, నాగరాజు, కొండపల్లి రూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version