ఏపి నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా

0

ఏపి నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్  కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముంది. 1992 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు సమాచారం. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీవిరమణ తర్వాత ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీవిరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్ కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీషు కుమార్ గుప్తా రెండోస్థానంలో ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version