ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు ఏపీ ఎంపీఏ నేతల అభినందన

Spread the love

 ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు ఏపీ ఎంపీఏ నేతల అభినందన 

ఇటీవల ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన జనసేన నేత, సీనియర్ జర్నలిస్ట్, పిడుగు హరిప్రసాద్ ను ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏ పీ ఎం పి ఏ) రాష్ట్ర నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ను ఏపీ ఎంపీ ఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ నేతృత్వంలో గురువారం కలిసి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు చిరు సత్కారం చేసి అభినందించారు. అనంతరం ఏపీ ఎంపీఏ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలపై జర్నలిస్టులు అర్హులైన వారందరికీ ఇల్లు ఇవ్వాలని జర్నలిస్టులకి పింఛన్ మంజూరు చేయాలని జర్నలిస్టులు పిల్లలకి ఫీజు 50% రాయితీ ఇవ్వాలని  జర్నలిస్ట్ కుటుంబానికి  హెల్త్ కార్డులు మంజూరు చేయాలని శాసనమండలిలో చర్చించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నే సోమేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాఖమూరి మల్లికార్జునరావు, రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు పసుపులేటి చైతన్య, తాళ్లూరు అనిల్ కుమార్, కార్యదర్శి మానేపల్లి మల్లికార్జునరావు, పుట్టి కృష్ణ ప్రసాద్, కోట రాజా, హరి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *