ఎమ్మెల్యే సుజనా చౌదరి కోలుకుంటున్నారు ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్

0

సుజనా చౌదరి కోలుకుంటున్నారు ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ( సుజనా చౌదరి) కోలుకుంటున్నారని ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ అన్నారు.ఇటీవల సుజనా చౌదరి లండన్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడగా శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోనీ తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి కృష్ణుని చల్లని దీవెనలతో కోలుకున్నారని త్వరలో ప్రజాసేవలో నిమగ్నమవుతారని చక్రధరి దాస్ ప్రభుజి తెలిపారు. ఆయన వెంట వ్రజదాం దాస్ ప్రభుజి ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version