ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.12-06-2025.
ఎన్. టి. ఆర్. పోలీస్ కమీషనరేట్ పరిధిలో విస్తృతంగా కార్డన్ & సెర్చ్.
ఎన్.టి.ఆర్.జిల్లా నందు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలలో భాగంగా, సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు రూరల్ డి.సి.పి. కె. ఎం మహేశ్వర రాజు ఐ. పి. ఎస్, మైలవరం ఏ.సి.పి వై.ప్రసాద రావు పర్యవేక్షణలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు విస్సన్న పేట ఎస్.ఐ రామ కృష్ణ వారి సిబ్బంది మరియు ఎక్సైజ్ అదికారులతో కలిసి విస్సన్న పేట గ్రామంలోని చండ్రు పట్ల తండా, కొర్రా తండా, పెద్ద తండా, మొదలగు ఏరియాలలో అదేవిధంగా తిరువూరు ఎస్.ఐ. మరియు వారి సిబ్బంది మరియు ఎక్సైజ్ అదికారులతో కలిసి తిరువూరు మండలం లోని వామ కుంట్ల గ్రామంలో మరియు గంపలగూడెం ఎస్.ఐ. వారి సిబ్బంది మరియు ఎక్సైజ్ అదికారులతో కలిసి గంపలగూడెం అమ్మిరెడ్డి గూడెం గ్రామంలో ఈ రోజు తెల్లవారుజము 06.00 గంటల నుండి 08.00 గంటల వరకు ఏక కాలంలో కార్దన్ & సెర్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్దన్ & సెర్చ్ లో బాగంగా గతంలో నాటు సారా తయారు చేయు ప్రాంతాలో అనుమానితులను మరియు పాత నేరస్తులను వివిధ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువు, క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని, నాటు సారా, గంజాయి, ఇతర మత్తు పధార్ధాల విక్రయాలు మరియు వినియోగంపై, అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇకనుంచి తరచుగా కార్డరన్ సెర్చ్ నిర్వహించడంతోపాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది. నేరాలు, ఘర్షణలు నియంత్రణకు పూర్తిస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది