ఎన్.టి.ఆర్. జిల్లా నగరంలో విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇంటర్ సెప్టర్ మరియు యాంటీ నార్కోటిక్ /ఈగల్ టీం బృందాలు

0

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ. తేదీ.27-07-2025.

ఎన్.టి.ఆర్. జిల్లా నగరంలో విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇంటర్ సెప్టర్ మరియు యాంటీ నార్కోటిక్ /ఈగల్ టీం బృందాలు

ఎన్.టి.ఆర్.జిల్లానందు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలలో భాగంగా, సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ఎ.సి.పి.లు ఎస్.కిరణ్ కుమార్ కె.లతాకుమారి పర్యవేక్షణలో, పోలీస్ కమీషనరేట్ పరిదిలో ఇంటర్ సెప్టర్ మరియు యాంటీ నార్కోటిక్ /ఈగల్ టీం లను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ ప్రత్యేక బృంధాల వారు నగరంలోని వివిధ ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీ నిర్వహించి చట్ట వ్యతిరేకంగా మద్యం, గంజాయి మరియు ఇతర వస్తువులను రవాణా నియంత్రించడం, అనుమానిత ప్రదేశములపై నిఘా పటిష్టం చేయడంతోపాటు విరివిగా ఆయా ప్రదేశాలను తనిఖీ చేయడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి మత్తు పధార్ధాలను సేవించడం వలన కలిగే అనార్ధాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. మాదకద్రవ్యాలను ఉపయోగించడం వలన కలిగే అనర్దాలపై స్కూల్స్, కళాశాలల మరియు పబ్లిక్ ప్రదేశాలలో యువతకు పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ఈ నేపధ్యంలో ది.26.07.2025 తేదీన ఇంటర్ సెప్టర్ మరియు యాంటీ నార్కోటిక్ /ఈగల్ టీం బృంధాల వారు నగరంలోని వివిధ ప్రదేశాలలో తనిఖీలను నిర్వహించి 163 మంది వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం మరియు వారిలో 69 మంది అనుమానిత వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ ద్వారా తనిఖీ చేయడం జరిగింది. ఓపెన్ ప్రదేశాలలో మధ్యం సేవించిన 31 మందిని అదుపులోనికి తీసుకుని తగు చర్య నిమిత్తం వారిని సంబంధిత పోలీసు స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది. ఈ క్రమంలో లేడీస్ హాస్టల్స్ సమీపంలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version