02-07-2025
ఎన్డీయే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు జెట్ స్పీడ్ లో అమలు చేస్తోంది : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
వించిపేటలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని
55వ,50 వ డివిజన్లలో ఇంటింటికి వెళ్లి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు వివరించిన ఎంపీ
తల్లికి వందనంతో విద్యార్ధుల కుటుంబాల్లో ఆనందం
- త్వరలో పీ4 లింక్ ద్వారా మహిళలకు ప్రతి నెల రూ.1500 భృతి*
- ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను షర్కిష్కరించేందుకు చర్యలు తీసుకున్న ఎంపీ కేశినేని చిన్ని*
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన
ఎంపీ కేశినేని శివనాథ్ కి ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు, ప్రజలు
విజయవాడ : గత ప్రభుత్వ హయంలో రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్దికి దూరంగా వున్నారు. అందుకే ఎన్డీయే కూటమి అధికారంలో రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ది పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో వున్న సంక్షేమం, అభివృద్ది ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో అధికారంలో రాగానే చెప్పిన విధంగా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి…ప్రతి నెల ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయలు ఎన్డీయే కూటమి అందించటంతో పాటు సూపర్ సిక్స్ పథకాలు జెట్ స్పీడ్ లో అమలు చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ, 55వ డివిజన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా,ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు లతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన
సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించారు. వారి అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం ఎంపీ కేశినేని శివనాథ్ కి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారి ఆనందం వ్యక్తం చేశారు.
తల్లికి వందనం ఒకటి రెండు కుటంబాలు పడలేదనే విషయం ఎంపీ కేశినేని శివనాథ్ దృష్టికి రాగా, వారికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అదే విధంగా పలు ప్రజల సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా ఎంపీ కేశినేని శివనాథ్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను సత్వరమే పరిష్కారము చేస్తామని తెలిపారు. అదే విధంగా ఎంపీ కేశినేని శివనాథ్ 50వ డివిజన్ లో శానిటేషన్ కార్యాలయాన్ని సందర్శించి వర్షా కాలం రానున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్ లో వున్నసంక్షేమం, అభివృద్ది విషయంలో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్రాన్నిముందుకు తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిని, అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో వివరించటం జరిగిందన్నారు.
ప్రతి పక్షంలో వున్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడామని…అధికారం లో వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల్లోనే వుంటున్నామన్నారు. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందే విషయంలో ఎలాంటి లోపం లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం పనితీరు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారి అభిప్రాయాల తెలుసుకోవటంతో పాటు ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుంటూ….ఆ సమస్యలను అధికారుల సహకారంతో అక్కడిక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం పేదలకు రూ.5లకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేస్తే…సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించినట్లు తెలిపారు. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నాడన్నారు.
అలాగే మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుండటంతో మహిళలకు ఆర్థికంగా ఉపయోగకరంగా వుందన్నారు. తల్లివందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరిగిందన్నారు. పాఠశాలలు తెరిచే సమయానికి తల్లివందనం కింద ఇంట్లో ఎంత మంది విద్యార్ధులు వుంటే అంత మందికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వటంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆనందంగా వున్నారని తెలిపారు.
అదే విధంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నారని, ఇందువల్ల ఆటో డ్రైవర్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా వుండేందుకు ఆగస్టు 14వ తేదీ పదిహేను వేల రూపాయాలు ఆటో డ్రైవర్లకు అందించనున్నట్లు తెలిపారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు అందించేందుకు డేటా సేకరణ పూర్తి అయిందని, మరో మూడు నెలల్లో నిరుద్యోగ భృతి అందించటానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. పీ 4 లింక్ ద్వారా ప్రతి నెల మహిళలకు ప్రతినెల రూ.1500 భృతి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతు సంక్షేమం కోసం ఈ నెలాఖరులో అన్నదాత సుఖీభవ పథకం రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాదిలో చెప్పినవే కాకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. .కొండ ప్రాంతాల్లో నివసించే వారి స్థలాలు రెగ్యూలరైజ్ చేయటం కోసం జి.వో నెంబర్ 30 తీసుకురావటం జరిగిందన్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం జరిగిందన్నారు.
వైసిపి నాయకులు చెప్పే దానికి చేసే దానికి పొంతన వుండదన్నారు. వైసిపి హయంలో ప్రజలను పీడించి, రాష్ట్రాన్నిదోచుకు తినటమే జరిగిందన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ కోసం పర్యటనలు చేసే ఆరాచక శక్తులు ప్రజల చెంతకి వస్తే తగిన బుద్ది చెప్పటానికి సిద్దంగా వున్నారని హెచ్చరించారు. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షంలో వున్నా, అధికారంలో వున్నా నిత్యం ప్రజలతో వుంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తారని, వైసిపి నాయకులాగా ఇంట్లో కూర్చొని బూటకపు మాటలు చెప్పమన్నారు.
ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షుడు ఎమ్.డి. జాహీద్, 50వ డివిజన్ అధ్యక్షురాలు కొప్పుల గంగ అరుణ శ్రీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు చిట్టాబత్తుని శ్రీనివాసరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుఖాసి సరిత, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు నమ్మి భాను ప్రకాష్ యాదవ్, సీనియర్ నాయకులు మరుపిళ్ల తిరుమలేశు, క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల సుబ్బారావు, టిడిపి దళిత సీనియర్ నాయకులు కామా దేవరాజులతో పాటు క్లస్టర్, బూత్ ఇన్చార్లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.