ఎన్డీఏ కార్యాలయంలో దివ్యాంగ మహిళ కు వీల్ చైర్ బహుకరణ
44 వ డివిజన్, లేబర్ కాలనీ కు చెందిన దివ్యాంగురాలు ఆర్ నాగమణి (66) కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ సీనియర్ నేత మైలవరపు దుర్గారావు కూటమి నేతలతో కలిసి ఎన్డీఏ కార్యాలయంలో వీల్ చైర్ ను బహుకరించారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కేంద్ర సామాజిక న్యాయశాఖ, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం ద్వారా వికలాంగులకు ఉపకరణాలను అందజేస్తున్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని వికలాంగులను గుర్తించి వారికి పరికరాలు అందేలా ఎన్డీఏ కూటమి నేతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
నడవలేని స్థితిలో ఉన్న తనకు వీల్ చైర్ అందించడంతో దివ్యాంగురాలు నాగమణి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుజనాకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కూటమి నేతలు పచ్చవ మల్లికార్జున, అజీజ్, వెంకట స్వామి, పులిచేరి రమేష్ సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..