ఎన్డీఏ కార్యాలయంలోఎల్.ఓ.సీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శిప్రత్తిపాటి శ్రీధర్

3
0

ఎన్డీఏ కార్యాలయంలో
ఎల్.ఓ.సీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్

ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను సోమవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

37వ డివిజన్ వన్ టౌన్ కు చెందిన కే లలిత దేవి ( 55) బ్రెస్ట్ ట్యూమర్ తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది
ఆవిడకు మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వారికి
రూ 2 లక్షల 25 వేల ఎల్.ఓ.సీ ను ఎన్డీఏ కూటమినేతల తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
బాధితురాలి కుటుంబ సభ్యులకు అందించారు .

అదేవిధంగా 56 వ డివిజన్ పాత రాజరాజేశ్వరి పేటకు కు చెందిన దొన్నపాటి రామక్క గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 1 లక్ష 8 వేల
ఎల్. ఓ.సీ ను అందజేశారు

త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు
కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు మధుసూదన రావు,
ఎన్డీఏ కూటమి నేతలు
పోలిశెట్టి శివ, నున్న కృష్ణ,
నాళం ఠాకూర్,
రేగళ్ల లక్ష్మణరావు,
పచ్చి పులుసు వెంకట శివప్రసాద్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు, టీ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here