03-08-2024
ఎంపి కేశినేని శివనాథ్ బర్త్ డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం
విజయవాడ : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుట్టిన రోజు సందర్బంగా టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే మంచి మనిషి, నిడారంబరుడు, సేవా తత్పరుడు అంటూ కొనియాడారు. ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదినం సందర్భంగా , వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా వుందన్నారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ కి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ డైరెక్టర్ సురవరపు నాగరాజు, దాసరి కనకారావు, ఆకుల సూర్య ప్రకాష్, పుల్లగూర చరణ్ సాయి యాదవ్,JCB వెంకటేశ్వరరావు, బ్రహ్మరాజు, సుధీర్ వర్మ, రాజేష్, రాజా గారు, ఫణి కుమార్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.