ఎంతమంది నోళ్లను మూయిస్తాం?

0

 


నటిగా సురేఖావాణికి మంచి పేరు ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా జర్నలిస్ట్ ‘ప్రేమ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ, తన సోషల్ మీడియా పోస్టుల పట్ల వస్తున్న కామెంట్స్ గురించి స్పందించారు. “నేను మా అమ్మాయితో కలిసి బయటికి వెళ్లినా .. మా ఇద్దరికీ సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా కొంతమంది చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. మొగుడుపోయిన తరువాత విచ్చలవిడి అయిందని కామెంట్స్ పెడుతున్నారు. 


భర్తలేని ఒక స్త్రీని చూసే దృష్టి కోణం మారుతుంది .. ఈ సమాజంలో ఇలాంటివాళ్లు ఉన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు స్పందిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కొత్తలో కాస్త బాధపడేదానిని కానీ, ఆ తరువాత కామెంట్స్ ను పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే ఎంతమంది నోళ్లని మూయిస్తాం. మా వాళ్లకు కూడా ఆ కామెంట్స్ చూడొద్దనే చెబుతుంటాను” అని అన్నారు. 


” ఒకసారి వర్మగారితో కలిసి ఫొటో దిగితే, దానిపై ఒకడు ఏకంగా యూ ట్యూబ్ లో ఒక ఎపిసోడ్ చేశాడు. అలాంటివారిని చూసినప్పుడు, ఇంతమంది ఇంత ఖాళీగా ఉంటున్నారా? అని మనసులో అనుకుంటాను. నా వలన డబ్బులు సంపాదించుకుంటున్నారు .. ఈ విధంగానైనా ఓ నలుగురికి భోజనం పెడుతున్నాను అనే అనుకుంటాను” అని చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version