ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా శాలువా కప్పి, జ్ఞాపిక అందించి మాధవ్ కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు. కూటమి స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
వర్తమాన రాజకీయ అంశాలపైనా, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంపైనా వారివురూ చర్చించుకున్నారు.